Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్ మెంట్.. హాజరైన మెగా ఫ్యామిలీ
ABN , Publish Date - Oct 31 , 2025 | 08:51 PM
ఎట్టకేలకు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్(Allu Sirish) కూడా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. కొద్దిసేపటి క్రితమే నయనికా (Nayanika) రెడ్డితో శిరీష్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది.
Allu Sirish: ఎట్టకేలకు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్(Allu Sirish) కూడా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. కొద్దిసేపటి క్రితమే నయనికా (Nayanika) రెడ్డితో శిరీష్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఈ మధ్యనే శిరీష్.. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఇక నిన్నటికి నిన్న ఎంగేజ్ మెంట్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తే వర్షం పాడు చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయినా కూడా అనుకున్న సమయానికే ఎంగేజ్ మెంట్ ను జరుపుకున్నాడు శిరీష్. అక్టోబర్ 31 న వీరి నిశ్చితార్ధం అతికొద్ది బంధుమిత్రుల మధ్య వధువు ఇంట ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, వరుణ్ తేజ్ దంపతులు , అల్లు అర్జున్ దంపతులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
ఇక క్రీమ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అల్లు శిరీష్ కనిపించగా.. ఎరుపు లంగా వోణి ధరించి చాలా సింపుల్ గా నయనికా కనిపించింది. సింపుల్ గా ఉన్నా కూడా ఈ జంట చూడముచ్చటగా ఉన్నారు. ఇక రింగులు మార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ శిరీష్.. ఎట్టకేలకు నా జీవితానికి ప్రేమగా మారిన నయనికాతో సంతోషంగా నిశ్చితార్థం జరుపుకున్నాను అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Nara Brahmani: నాన్న నటన వారసత్వంగా వచ్చింది.. చెల్లి యాక్టింగ్ పై అక్క ప్రశంస
Andhra King Taluka: చిన్ని గుండెలో సాంగ్.. కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది