Nara Brahmani: నాన్న నటన వారసత్వంగా వచ్చింది.. చెల్లి యాక్టింగ్ పై అక్క ప్రశంస

ABN , Publish Date - Oct 31 , 2025 | 08:28 PM

నందమూరి కుటుంబం నుంచి ఇప్పటివరకు హీరోలు తెలుగుతెరకు పరిచయమయ్యారు కానీ, అమ్మాయిలు మాత్రం కెమెరా ముందుకు రాలేదు.

Nara Brahmani

Nara Brahmani: నందమూరి కుటుంబం నుంచి ఇప్పటివరకు హీరోలు తెలుగుతెరకు పరిచయమయ్యారు కానీ, అమ్మాయిలు మాత్రం కెమెరా ముందుకు రాలేదు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇద్దరు కుమార్తెలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. చదువు పూర్తికాగానే పెళ్లి చేసి పంపించాడు. ఇక నారా బ్రాహ్మణి.. మామగారి బిజినెస్ లు చూసుకుంటూ బిజీగా మారగా.. రెండో కూతురు తేజస్విని మొదటిసారి తండ్రి బాటలో అడుగు వేసింది.

నందమూరి తేజస్విని.. సిద్దార్థ ఫైన్ జ్యూవెలరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. మొట్ట మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి ఈ ఆభరణాల యాడ్ లో నటించింది. తాజాగా ఈ వాణిజ్య ప్రకటనను రిలీజ్ చేశారు. మొదటి యాడ్ లోనే తేజస్విని తండ్రికి తగ్గ తనయ అని అనిపించుకుంది. హవభావాలను పలికించడం లోనూ.. ముఖంలో అందమైన కళ మొత్తం ఆమెను ఒక హీరోయిన్ లానే చూపించింది.

ఇక ఉదయం నుంచి తేజస్విని గురించే సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. తాజాగా చెల్లి నటనకు అక్క బ్రాహ్మణి కూడా ఫిదా అయ్యింది. చెల్లిని చూసి గర్వంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ' తేజూ, నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నువ్వు తెరపై మొదటిసారి కనిపించడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. నీ గ్రేస్, ఆత్మవిశ్వాసం.. నీ ఉనికిని సహజంగానే ప్రకాశించేలా చేశాయి. నాన్న నటనను వారసత్వంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. నువ్వు మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి తేజస్విని ముందు ముందు సినిమాల్లో కూడా కనిపిస్తుందేమో చూడాలి.

Nandamuri Balakrishna: నంద‌మూరి వార‌సుడు వెన‌క‌డుగు.. కూతురు ముందడుగు!

Andhra King Taluka: చిన్ని గుండెలో సాంగ్.. కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది

Updated Date - Oct 31 , 2025 | 08:28 PM