Kannapa: కేన్స్‌లో.. మంచు ఫ్యామిలీ సంద‌డి

ABN , Publish Date - May 20 , 2024 | 06:39 PM

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా టైటిల్‌ పాత్రలో న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘కన్నప్ప’. తాజాగా ప్ర‌ఖ్యాత కేన్స్ వేదిక‌గా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు (సోమ‌వారం) మంచు మోహ‌న్‌బాబు, ప్ర‌భు దేవ‌, మంచు విష్ణు, ఆయ‌న భార్య విరానికా రెడ్డిలు కేన్స్ కు బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Kannapa: కేన్స్‌లో.. మంచు ఫ్యామిలీ సంద‌డి
kannappa

మంచు విష్ణు (Manchu vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా టైటిల్‌ పాత్రలో న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘కన్నప్ప’ (Kannapa). అక్ష‌య్‌కుమార్‌, ప్ర‌భాస్‌, మోహ‌న్ లాల్‌, శివ రాజ్ కుమార్‌, మోహ‌న్‌బాబు,శ‌ర‌త్‌కుమార్‌, న‌య‌న‌తార‌, కాజ‌ల్ వంటి భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ న్యూజిలాండ్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే గ్లిమ్స్‌, లుక్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ప్ర‌ఖ్యాత కేన్స్ వేదిక‌గా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


ఈ నేప‌థ్యంలో ఈ రోజు (సోమ‌వారం) మంచు మోహ‌న్‌బాబు, ప్ర‌భు దేవ‌, మంచు విష్ణు, ఆయ‌న భార్య విరానికా రెడ్డిలు కేన్స్ (Canes Film Festival) కు బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సాయంత్రం టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఇప్పుడు వీరు కేన్స్ (Canes Film Festival) లోకి ఎంట్రీ ఇస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

Updated Date - May 20 , 2024 | 06:39 PM