Peddi: పెద్దిలో రామ్ చరణ్ తల్లిగా ఛాన్స్ పట్టేసిన అఖండ నటి

ABN , Publish Date - Sep 15 , 2025 | 09:37 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం పెద్ది (Peddi). బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది.

Viji Chandrasekhar

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం పెద్ది (Peddi). బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గేమ్ ఛేంజర్ లాంటి భారీ పరాజయం తరువాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఎన్నో అంచనాలను పెట్టుకుంది.


ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం బుచ్చి స్టార్ క్యాస్టింగ్ నే దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విలన్ గా మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా పెద్దిలో రామ్ చరణ్ తల్లిగా సీనియర్ నటి విజి చంద్రశేఖర్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. విజి.. తెలుగువారికి సుపరిచితమే. కన్నడ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆమె అప్పట్లో హీరోయిన్ గా కూడా నటించింది. అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి మరింత గుర్తింపును అందుకుంది.


అఖండ తరువాత విజికి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ఇక ఇప్పుడు పెద్దితో మరో లక్కీ ఛాన్స్ ను పట్టేసింది విజి. ఇందులో తల్లి పాత్ర కూడా చాలా కీలకమని, సహజంగా కనిపించడంతో పాటు నటన కూడా విలేజ్ తల్లిలానే ఉండాలని ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాటింగ్ ను బట్టి బుచ్చి పెద్దిని చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Tanushree Dutta: బిగ్ బాస్.. ఒకే మంచంపై వేరొక వ్యక్తితో పడుకొనేంత చీప్ కాదు

Huma Qureshi: సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్

Updated Date - Sep 15 , 2025 | 09:37 PM