Huma Qureshi: సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్

ABN , Publish Date - Sep 15 , 2025 | 07:29 PM

బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి (Huma Qureshi) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Huma Qureshi

Huma Qureshi: బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి (Huma Qureshi) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా సినిమాలో హ్యూమా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో రజినీకి లవర్ గా నటించి మెప్పించింది హ్యూమానే. ఈ సినిమా హ్యూమాకు మంచి విజయాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత చాలా గ్యాప్ ఇచ్చి అజిత్ నటించిన వలిమైలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇది కూడా అమ్మడికి విజయాన్ని అందివ్వలేదు.


హిందీలో హ్యూమా మంచి సినిమాలలోనే నటించింది. మహారాణి వెబ్ సిరీస్ తో హ్యూమా స్టార్ గుర్తింపును అందుకుంది. ఆ తరువాత బెల్ బాటమ్, డబుల్ ఎక్స్ ఎల్, తార్ల, మౌనిక ఓ మై డార్లింగ్ లాంటి సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం హ్యూమా జాలీ LLB 3 లో నటిస్తోంది. అమ్మడి సినిమాల విషయం పక్కన పెడితే.. ఈ చిన్నది సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని బాలీవుడ్ ను షేక్ చేసింది.


గత కొంతకాలంగా హ్యూమా.. యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపించాయి. ఇద్దరూ కలిసి వెకేషన్స్, రెస్టారెంట్స్ అంటూ కెమెరా కంటికి కూడా చిక్కారు. అయితే తాజాగా వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ తో ఒక్కట్టయ్యారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా రెండు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారట. హ్యూమాకు 39 ఏళ్ళు. రచిత్ ఆమెకన్నా చిన్నోడిని సమాచారం. ఏదిఏమైనా 40 ఏళ్ల వయస్సులో హ్యూమా పెళ్లి కూతురు కావడం విశేషమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది.

Sudheer Babu: జానపద గాథతో 'జటాధర'

Teja Sajja: మిరాయ్ తరువాత తేజ చేస్తున్న సినిమా ఏంటో తెలుసా

Updated Date - Sep 15 , 2025 | 08:23 PM