Tanushree Dutta: బిగ్ బాస్.. ఒకే మంచంపై వేరొక వ్యక్తితో పడుకొనేంత చీప్ కాదు

ABN , Publish Date - Sep 15 , 2025 | 08:21 PM

బాలీవుడ్ వివాదాస్పద నటి తనుశ్రీ దత్తా (Tanushree Dutta) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

Tanushree Dutta

Tanushree Dutta: బాలీవుడ్ వివాదాస్పద నటి తనుశ్రీ దత్తా (Tanushree Dutta) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అల్లరి పిడుగు, వీరభద్ర సినిమాల్లో బాలయ్యతో రొమాన్స్ చేసి మెప్పించింది తనుశ్రీ. ఇక ఈ సినిమాలు అమ్మడికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. దీంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ఇక మీటూ ఉద్యమానికి ఆజ్యం పోసిన హీరోయిన్ తనుశ్రీ దత్తా. ఇప్పటికీ ఆ ఉద్యమం కోసమే పోరాడుతుంది.


నిత్యం ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో మాట్లాడుతూ రచ్చ చేసే తనుశ్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై సంచలన కామెంట్స్ చేసింది. అసలు అలాంటి షోకు తాను ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది. అదొక దారుణమైన షో అని తెలిపింది. ' గత 11 ఏళ్లుగా నాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వస్తూనే ఉంది. రూ. 1.65 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా అనెను రిజెక్ట్ చేశాను. ఇప్పుడే కాదు జీవితంలో నేను బిగ్ బాస్ కు వెళ్ళను. ఎవరు వచ్చి చెప్పినా.. ఆ నింగిలోని చందమామను కిందకు దించుతామని చెప్పినా నేను వెళ్ళను.


ఎప్పటి నుంచో నన్ను బిగ్ బాస్ యాజమాన్యం షోకు రావాలని కోరుతుంది. నాతోపాటు నా స్థాయి నటిని కూడా కోరుతుంది. కానీ, నేను రాను అని చెప్పాను. ఎందుకంటే అక్కడ ఒకే రూమ్ లో ఆడవారు, మగవారు కలిసి ఒకే బెడ్ పై పడుకుంటారు. అక్కడే గొడవపడతారు. అది నాకు ఇష్టం లేదు. ఒక రియాలిటీ కోసం ఒకే మంచంపై ఎవరో తెలియని వ్యక్తి పక్కన పడుకోనే అమ్మాయిలా కనిపిస్తున్నానా.. ? అంత చీప్ కాదు. నాకంటూ కొన్ని ఆహారపు అలవాట్లు ఉన్నాయి. వాటిని నేను మార్చుకోలేను. అందుకే నేను బిగ్ బాస్ కు వెళ్ళను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

NTR: శ్రీరామునిగా 'అన్న' అరుదైన చరిత్ర

Pawan - Suman: ఇంట్రెస్టింగ్ సజెషన్ - ఏపీలో మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్

Updated Date - Sep 15 , 2025 | 08:21 PM