సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Sethupathi: నాగార్జునకు ఆ పరీక్షలు చేయించాలి.. విజయ్ సేతుపతి వ్యాఖ్యలు వైరల్

ABN, Publish Date - Dec 10 , 2025 | 03:35 PM

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్సి షో బిగ్ బాస్ (Biggboss) ప్రస్తుతం ప్రతి భాషలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.

Vijay Sethupathi

Vijay Sethupathi: వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్సి షో బిగ్ బాస్ (Biggboss) ప్రస్తుతం ప్రతి భాషలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), తమిళ్ లో విజయ్ సేతుపతి (Vajay Sethupathi), మలయాళంలో మోహన్ లాల్ (Maohan Lal), కన్నడలో కిచ్చా సుదీప్ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. వీరందరూ చాలా రేర్ గా ఒక ఫ్రేమ్ లో కనిపిస్తారు. తాజాగా జియో హాట్ స్టార్ సౌత్ అన్ బాండ్ ఈవెంట్ లో మొత్తం కాకపోయినా ముగ్గురు స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. వారే అక్కినేని నాగార్జున, విజయ్ సేతుపతి, మోహన్ లాల్.

ఇక ఈ ఈవెంత్ లో విజయ్ సేతుపతి.. అక్కినేని నాగార్జునపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ఆయన వయస్సు గురించి మాట్లాడాడు. నాగార్జున వయస్సు రోజు రోజుకు తగ్గిపోతుందని, దానికి కారణం ఏంటో తనకు తెలియడం లేదని చెప్పుకొచ్చాడు. ' అక్కినేని నాగార్జునను నేను ఎన్నో ఏళ్లుగా ఎం గమనిస్తున్నాను. ఆయన నా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అసలు ఆయన వయస్సు ఎందుకు పెరగడం లేదో నాకు అర్ధం కావడం లేదు. నాగార్జునను యాంటీ ఏజింగ్ పై రీసెర్చ్ చేసేవారు తీసుకెళ్లి ఆయనకు ఆ పరీక్షలు చేయించాలి. నాగార్జున వయస్సు ఎందుకు పెరగడం లేదో రీసెర్చ్ చేయాలి.

వయస్సు మాత్రమే కాదు.. ఆయన జుట్టు కూడా అలానే ఉంది. ఇక ఎనర్జీ అయితే ఈ మాత్రం తగ్గలేదు. రేపు నా మనవళ్లు పుట్టి.. పెద్దవాళ్లు అయినా కూడా నాగార్జున అలాగే ఉంటారు' అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. విజయ్ సేతుపతి అన్నాడు అని కాదు కానీ, నాగ్ నిజంగా ఇప్పటికీ ఇంత యాక్టివ్ గా ఉండడం అనేది ఎంతో ఆశ్చర్యం అని చెప్పాలి. ఆయ్న వయస్సు 60 దాటింది. అయినా కూడా నాగ్ కుర్ర హీరోలకు పోటీగా వస్తున్నాడు.. ఏదేమైనా మన్మథుడు.. మన్మథుడే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 03:37 PM