Pre Release Event: ఇది వారి కింగ్‌డమ్‌

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:29 AM

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం కింగ్‌డమ్‌, భాగ్యశ్రీ బోర్సే..

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకున్నాయి. ఈ నెల 31న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘మీ అభిమానం నాకు దేవుడిచ్చిన వరం. మీరు నా విజయాన్ని చూడాలని కోరుకుంటున్నాను. ఇది విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ కాదు. గౌతమ్‌ తిన్ననూరి, అనిరుధ్‌, ఎడిటర్‌ నవీన్‌ నూలితో పాటు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లేలా పనిచేసిన చిత్రబృందానిది. ఇందులో నా బ్రదర్స్‌గా సత్యదేవ్‌, వెంకటేశ్‌ అదరగొట్టారు. సినిమా అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది’’ అని చెప్పారు. ‘‘విజయ్‌ ఓ అద్భుతమైన వ్యక్తి. ఏ సపోర్ట్‌ లేకుండా ఎదిగారు. ఆయనకు ఈ సినిమాతో గుర్తుండిపోయే హిట్‌ దక్కాలని కోరుకుంటున్నా. అనిరుధ్‌ పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని నటుడు సత్యదేవ్‌ చెప్పారు. ‘‘తెలుగు సినిమాల పరంగా నాకు నాగవంశీ మెంటార్‌. ‘కింగ్‌డమ్‌’ ‘జెర్సీ’కి మించిన హిట్‌ అవుతుంది. నాపై తెలుగువారు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను’’ అని సంగీత దర్శకుడు అనిరుధ్‌ తెలిపారు.

Also Read: Actress Ramya: నిన్ను అత్యాచారం చేసి చంపేస్తాం.. హీరో ఫ్యాన్స్ బెదిరింపులు

Also Read: Chaurya Paatham: మనీ హైస్ట్ ను తలపించే చోరీ.. ట్విస్టులకు దిమ్మ తిరగాల్సిందే

Updated Date - Jul 29 , 2025 | 06:29 AM