Vijay Devarakonda: నేను బాగానే ఉన్నాను.. కంగారు పడకండి
ABN, Publish Date - Oct 06 , 2025 | 09:54 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కారుకు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కారుకు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి NH 44 పై పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా బొలెరో వాహనం.. ఓవర్ టేక్ చేస్తూ విజయ్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కారు మాత్రం కొద్దిగా ధ్వంసం అయ్యింది. విజయ్.. తన ఫ్రెండ్ కారులో సేఫ్ గా ఇంటికి చేరుకున్నాడు.
ఇక విజయ్ కారుకు ప్రమాదం అని తెలియడంతో అభిమానులు భయాందోళనకు గురయ్యారు. విజయ్ కు ఏమైందో ఏమో అని కంగారు పడ్డారు. దీంతో విజయ్.. తాను బాగానే ఉన్నాను అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. కారుకు దెబ్బ తగిలింది కానీ తనకేమి కాలేదని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు. అంతేకాకుండా వర్క్ అవుట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చినట్లు కూడా చెప్పుకొచ్చాడు.
' అంతా బాగానే ఉంది. కారు దెబ్బతింది, కానీ మేమంతా బాగానే ఉన్నాము. నేను బలం పెంచుకోవడానికి వర్క్ అవుట్స్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. కొద్దిగా తలనొప్పిగా ఉంది. బిర్యానీ తిని నిద్రపోతే అంతా బాగుంటుంది. కాబట్టి మీ అందరికీ నా ప్రేమ అందిస్తున్నాను. ఈ ప్రమాదం గురించి ఎక్కువ ఆలోచించకండి' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Keerthiswaran: రజనీకాంత్‌ను దృష్టిలో ఉంచుకుని.. 'డ్యూడ్'
ANR: అక్కినేని కూతురు.. ఏవీ సుబ్బారావు కొడుకు... కళ్యాణం!