Vijay Devarakonda: 43వ 'ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్' లో  

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:30 PM

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని సందడి చేశారు హీరో విజయ్ దేవరకొండ.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని సందడి చేశారు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). మాడిసన్ అవెన్యూలో  సర్వే భవంతు సుఖినః అనే థీమ్‌తో జరిగిన పరేడ్ వేడుకలకు గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించారు. ఈ వేడుకల్లో స్థానిక అమెరికన్స్ తో పాటు భారీ సంఖ్యలో అమెరికాలోని ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మన జాతీయ జెండాలోని మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మువ్వన్నెల లైటింగ్ ను విజయ్ దేవరకొండ స్విచ్ఛాన్ చేశారు.

Vijay.jpg

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రవాస భారతీయ సోదరులు మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై మన మూడు రంగులు చూడటం సంతోషాన్ని కలిగిస్తోంది. దేశం కోసం వీళ్లు చేస్తున్న కాంట్రిబ్యూషన్ చూస్తుంటే గర్వంగా ఉంది. మన పెద్దలు ఎంతోమంది చేసిన త్యాగాలు, వారి కృషి వల్లే మనం ఈ రోజు ఇంత ఆనందంగా  స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం' అని అన్నారు.

ALSO READ: Pragathi: అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది

Kasarla Shyam: కాసర్ల శ్యామ్‌.. నేషనల్ అవార్డు సీక్రెట్ అదే

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ బర్త్ డే.. రాజాసాబ్ స్పెషల్ పోస్టర్ చూశారా

The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ ఫస్ట్ మూవీ గ్లింప్స్‌

Maareesan: ఓటీటీకి వచ్చేస్తున్న ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా .. ఎందులో చూడొచ్చంటే




Updated Date - Aug 17 , 2025 | 05:33 PM