Vijay Devarakonda: స్టంట్స్ చేసింది విజయ్ కాదా..
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:07 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం కింగ్డమ్ (Kingdom) సినిమాతో బిజీగా ఉన్న తెల్సిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం కింగ్డమ్ (Kingdom) సినిమాతో బిజీగా ఉన్న తెల్సిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ మధ్య రిలీజ్ అయినా అన్నా అంటేనే అనే సాంగ్ మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
కింగ్డమ్ సినిమా జూలై 31 న రిలీజ్ కు రెడీ అవుతుంది. కానీ, ఏంకర్స్ మాత్రం ఇంకా నిమ్మకు నీరెత్తినట్టే ప్రవర్తిస్తున్నారు. విజయ్ కు డెంగ్యూ అని, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని వార్తలు వినిపించాయి. అది ఎంతవరకు నిజమో అన్న విషయం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. పోనీ ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారా అంటే అది కూడా లేదు. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ కోసం స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. రెండు గోడల మధ్య నిలబడి.. తన రెండు కాళ్లతో గోడ ఎక్కి.. ఇంకోగోడపై దూకాడు. కింగ్డమ్ యాక్షన్ సీక్వెన్స్ లలో విజయ్ ఎలాంటి డూప్ వాడకుండా ఒరిజినల్ స్టంట్స్ చేశాడని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.
నిజంగా ఆ వీడియో చూస్తే విజయ్ దేవరకొండనే ఆ స్టంట్స్ చేసినట్లు కనిపిస్తుంది కదా. అయితే అందులో ఉన్నది విజయ్ కాదు. గుబురు గడ్డం, క్యాప్ పెట్టుకోవడంతో సైడ్ నుంచి చూసి విజయ్ అని పొరపాటు పడ్డారు. కానీ, ఆ స్టంట్స్ చేసింది విజయ్ కాదు.. ఇది ఏపీ ఫ్లిప్పర్ అనే యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో. అచ్చు విజయ్ లా ఉండడంతో కొంతమంది విజయ్ అనుకోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక నిజం తెలుసుకున్న నెటిజన్స్ భలే మోసం చేశారుగా అని కామెంట్స్ పెడుతున్నారు.
Director Vassishta: విశ్వంభర స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్.. కథేంటంటే
The Odyssey Movie: క్రిస్టఫర్ నోలాన్ క్రేజ్....