Vijay Devarakonda: హిట్ కోసం విజయ్ కష్టాలు.. మంచి డైరెక్టర్ నే పట్టాడు

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:58 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే.

Vijay Devarakonda

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది రిలీజైన కింగ్డమ్ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా నిరాశపడకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టి హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఇక ఇది కాకుండా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు కానుంది. ఈ రెండు సినిమాలు కాకుండా విజయ్ మరో సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. మనం సినిమాతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ తో విజయ్ టీమ్ అప్ అయ్యాడని టాక్ నడుస్తుంది.

ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే విక్రమ్ ఈ మధ్యనే నితిన్ తో ఒక సినిమాను సెట్ చేశాడని టాక్ నడిచించి. ఇప్పుడు ఆ కథనే విజయ్ కు చెప్పి ఒప్పించాడా.. ? లేక వేరే కథనా అని తెలియాల్సి ఉంది.

Mega Star Chiranjeevi: పొంగల్ సీజన్ లో చిరు సరికొత్త రికార్డ్...

Rishabh Shetty: టాప్ 1 పొజిషన్ కు చేరువలో...

Updated Date - Oct 17 , 2025 | 03:58 PM