Kingdom Second Single Promo: అన్నదమ్ముల అనుబంధం.. మరో చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందే
ABN, Publish Date - Jul 15 , 2025 | 09:10 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. లైగర్ ప్లాప్ తరువాత విజయ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు.
Kingdom Second Single Promo: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. లైగర్ ప్లాప్ తరువాత విజయ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు. ఈసారి కింగ్డమ్(Kingdom) తో విజయ్.. ప్లాపులకు చెక్ పెట్టి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. జెర్సీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం కింగ్డమ్. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 31 న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి
అన్ని బావుండి ఉంటే ఈపాటికి కింగ్డమ్ రిలీజ్ కూడా అయ్యేది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూలై 31 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. అన్నా అంటేనే ఉన్నా అంటూ ఆమె సాంగ్ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో విజయ్ కు అన్నగా సత్యదేవ్ కనిపించాడు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది అనేది ఈ సాంగ్ లో చూపించారు. చిన్నప్పటి నుంచి చిన్నోడికి అండగా ఉన్న పెద్దోడిని చూపించారు. విజువల్స్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. జూలై 16 న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇక సాంగ్ కు ఏదైనా హైలెట్ అంటే అది అనిరుధ్ వాయిస్. తెలుగులో అనిరుధ్ వాయిస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఈ సాంగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే కింగ్డమ్ నుంచి వచ్చిన మొదటి సాంగ్ హృదయం లోపల భారీ విజయం అందుకొని చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్ కూడా మరో చార్ట్ బస్టర్ గా నిలుస్తుంది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా విజయ్ దేవరకొండ విజయం అందుకుంటాడా.. ? లేదా..? అనేది చూడాలి.
Singer Arijit Singh: డైరెక్టర్ గా మారుతున్న స్టార్ సింగర్..
Srimad Bhagavatam: గేమ్ ఆఫ్ థ్రోన్స్, మిషన్ ఇంపాజిబుల్ టీమ్‌తో.. శ్రీమద్ భాగవతం