Singer Arijit Singh: డైరెక్టర్ గా మారుతున్న స్టార్ సింగర్..

ABN , Publish Date - Jul 15 , 2025 | 07:29 PM

సింగర్ అర్జిత్ సింగ్ (Arijit Singh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి మంచి హిట్ సాంగ్స్ ను ఆలపించిన రికార్డ్ అర్జిత్ ది.

Arijit Singh

Singer Arijit Singh: సింగర్ అర్జిత్ సింగ్ (Arijit Singh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి మంచి హిట్ సాంగ్స్ ను ఆలపించిన రికార్డ్ అర్జిత్ ది. ప్రస్తుతం ఈ స్టార్ సింగర్ కొత్త అవతారమెత్తబోతున్నాడు. ఇండస్ట్రీలో హీరోలు.. డైరెక్టర్లు గా మారారు. డైరెక్టర్లు.. హీరోలుగా మారారు. అయితే చాలా రేర్ గా ఒక సింగర్.. డైరెక్టర్ గా మారబోతున్నాడు. అవును.. సింగర్ అర్జిత్ సింగ్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.


బాలీవుడ్ మీడియా ప్రకారం అర్జిత్ సింగ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఈ సినిమాకు మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందని సమాచారం.పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న అర్జిత్ ఈ సినిమా కోసం స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నాడట. అయితే కథను కూడా అర్జిత్ నే అందించాడా.. ? కేవలం డైరెక్షన్ మాత్రమే చేస్తున్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.


త్వరలోనే అర్జిత్ సింగ్ సినిమా టైటిల్ ను, క్యాస్టింగ్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విషయం తెలియడంతో ఆయన అభిమానులు.. మంచి విజయం అందుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగువారికి కూడా అర్జిత్ సుపరిచితుడే. స్వామి రారా సినిమాలో కృష్ణుడి వారసులంతా అనే సాంగ్ తో బాగా పాపులర్ అయిన అర్జిత్ సింగ్.. ఆ తరువాత మనం,కేడి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి సినిమాల్లో మంచి మంచి పాటలు పాడాడు. మరి సింగర్ గా సక్సెస్ అందుకున్న అర్జిత్ సింగ్ డైరెక్టర్ గా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Diamond Raja: వ‌రుణ్ సందేశ్ డైమండ్ రాజా నుంచి.. హే రాజా హే రాజా సాంగ్‌

B. Saroja Devi: చనిపోయి కూడా మరొకరి జీవితంలో వెలుగు నింపిన సరోజాదేవి

Updated Date - Jul 15 , 2025 | 07:29 PM