సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mirai: ఫ్యాన్స్ డిమాండ్.. నేటి నుంచి థియేటర్‌లో వైబ్ ఉందిలే

ABN, Publish Date - Sep 23 , 2025 | 02:17 PM

సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసినా.. ఎంతమంది స్టార్స్ తో తీసినా అదంతా ప్రేక్షకులను మెప్పించడానికే. వారు సంతృప్తి చెందితేనే సినిమా హిట్.

Mirai

Mirai: సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసినా.. ఎంతమంది స్టార్స్ తో తీసినా అదంతా ప్రేక్షకులను మెప్పించడానికే. వారు సంతృప్తి చెందితేనే సినిమా హిట్. కలక్షన్స్.. ఇక సినిమాలో ఏదైనా నిరాశ పరిస్తే మాత్రం అది ఫ్యాన్స్ మనసులో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అయిది అలాంటి నిరాశ తమ ఫ్యాన్స్ లో ఉండకూడదని మిరాయ్ (Mirai) సినిమా మేకర్స్ వారు కోరుకున్నట్లుగానే సోషల్ మీడియాను షేక్ చేసిన సాంగ్ ను సినిమాలో యాడ్ చేశారు.


తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోతెరకెక్కిన చిత్రం మిరాయ్. మంచు మనోజ్ విలన్ గా, రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 134 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా అంతా బావుంది కానీ.. రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే సాంగ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.


వైబ్ ఉందిలే సాంగ్ రిలీజ్ అయిన వెంటనే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఎక్కడ చూసినా అదే స్టెప్, అదే లుక్, అదే మ్యూజిక్. అసలు ఈ సాంగ్ థియేటర్ లో చూస్తుంటే వచ్చే కిక్కే వేరప్పా అనుకోని థియేటర్ కి వెళ్తే.. కథకు అడ్డు వస్తుందని సాంగ్ ను తీసేశారని తెలిసి ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేశారు. బంగారం లాంటి సాంగ్.. ఉంటే ఇంకా బావుండేది అని పెదవి విరిచారు. ఆ సాంగ్ ను యాడ్ చేయాలనీ డిమాండ్ కూడా చేశారు.


ఇక ఫ్యాన్స్ నిరాశను అర్ధం చేసుకున్న మేకర్స్.. నేటి నుంచి అనగా సెప్టెంబర్ 23 నుంచి వైబ్ ఉంది సాంగ్ ను సినిమాలో యాడ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. మరి వైబ్ సాంగ్ యాడ్ చేశాక మిరాయ్ ఇంకే రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి.

Katrina Kaif: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన కత్రీనా..

Pawan Kalyan: 'ఎ' సర్టిఫికెట్ ప్రభావం 'ఓజీ'పై పడుతుందా...

Updated Date - Sep 23 , 2025 | 04:19 PM