Venkatesh: వెంకటేష్ ఇంట విషాదం..
ABN, Publish Date - Sep 01 , 2025 | 03:22 PM
దగ్గుబాటి వెంకటేష్(Daggubati Venkatesh) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెంకటేష్ 12 ఏళ్లుగా పెంచుకుంటున్న కుక్క మరణించింది.
Venkatesh: దగ్గుబాటి వెంకటేష్(Daggubati Venkatesh) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెంకటేష్ 12 ఏళ్లుగా పెంచుకుంటున్న కుక్క మరణించింది. ఈ విషయాన్నీ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'నా ప్రియమైన గూగుల్ గత 12 సంవత్సరాలుగా, నువ్వు మా జీవితాలను ప్రేమతో మరియు అందమైన జ్ఞాపకాలతో నింపావు. నువ్వు మా సన్ షైన్. ఈ రోజు మేము నీకు వీడ్కోలు పలికాము. నువ్వు వదిలి వెళ్లాక .. ఆ లోటును, బాధను మేము మాటల్లో చెప్పలేము. ప్రియ మిత్రమా, నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను' అంటూ చెప్పుకొచ్చాడు.
వెంకీ మామకు జంతువులు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కుక్కలను ఆయన ఎంతో ప్రేమగా చూస్తారు. గూగుల్ తో దగ్గుబాటి కుటుంబానికి అనుబంధం ఉంది. ఎఫ్ 2 లో వెంకీ మామతో కలిసి గూగుల్ నటించింది. భార్యతో తాను పడుతున్న బాధలను కుక్క ముందు చెప్పి ఏడ్చే సీన్ లో ఉన్న కుక్క గూగులే. ఆ ఫోటోను కూడా వెంకీ షేర్ చేశాడు.
ఇక వెంకటేష్ కెరీర్ విషయానికొస్తే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరిన ఆయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న వెంకీ.. దీని తరువాత వివి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో లక్ష్మీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ కాంబోను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
GAMA Awards: ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. ఉత్తమ చిత్రం పుష్ప 2
Tollywood Movies: కన్నీళ్ళు, చెప్పుదెబ్బలు గిమ్మిక్కులేనా...