Srikanth Odela: నీయమ్మ.. జీవితకాలం ఆడే సినిమారా చిరంజీవి

ABN , Publish Date - Aug 22 , 2025 | 08:06 PM

ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా ఒక అభిమాన హీరో ఉంటారు. కానీ, టాలీవుడ్ లో స్టార్స్ గా కొనసాగుతున్న ప్రతి హీరోకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నే అభిమాన హీరో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ChiruOdela

Srikanth Odela: ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా ఒక అభిమాన హీరో ఉంటారు. కానీ, టాలీవుడ్ లో స్టార్స్ గా కొనసాగుతున్న ప్రతి హీరోకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నే అభిమాన హీరో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోలు మాత్రమే కాదు కుర్ర డైరెక్టర్స్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రతి డైరెక్టర్.. తాను చిరంజీవిని చూసే ఇండస్ట్రీకి రావాలని ఆశపడ్డాను అని చెప్పుకొస్తాడు. అలాంటి అభిమానుల్లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల
(Srikanth Odela) ఒకడు. న్యాచురల్ స్టార్ నానికి దసరా లాంటి హిట్ ను ఇచ్చి.. ఆ తరువాత సినిమానే చిరుతో చేసే ఛాన్స్ పట్టేశాడు శ్రీకాంత్ ఓదెల.


చిరు ఓదెల సినిమాను ఇప్పటికే శ్రీకాంత్ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక నేడు చిరు పుట్టినరోజు కావడంతో ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ ఓదెల. చిన్నతనం నుంచి చిరుపై పెంచుకున్న అభిమానాన్ని మాటల రూపంలో చెప్పుకొచ్చాడు. ఒక అభిమానిగా చిరుకు ఏం చేయగలనో అదే తన సినిమాతో చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.


'నువ్వు నా డెమి-గాడ్! చిరంజీవితో ఒక ఫోటో దిగి ఇంట్లో అమ్మకు చూపిస్తే - ఫస్ట్ టైమ్ నువ్వు ఫోటోలో నవ్వడం చూస్తున్నారా అని చెప్పింది. అది చిరంజీవికి నా నిర్వచనం. ఏం చేస్తాడు చిరంజీవి అంటే: నా లాంటి ఇంట్రోవర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు, సినిమా టిక్కెట్లు కొన్నుకునేవాడితో సినిమా తీయించగలడు. నీ యమ్మ - జీవితకాలంఆడే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే! జీవితకాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు.


చివరకు.. తెరపై నా చిరంజీవిని మిస్ అవుతున్నాను. నేను అతనిని తిరిగి తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాను! నా కోసం నేనే తీస్తున్న సినిమా ఇది. నాలాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం చూస్తున్న సినిమా చిరు ఓదెల . ఇది బ్లడ్ ప్రామిస్. T-REX మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫోటో తీస్తున్నప్పుడు హ్యాండ్ వణికి బ్లర్ వచ్చింది. ఏం అనుకోకండి' అంటూ చిరుతో మొదటిసారి కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఈ ఫోటో, ఈ ప్రామిస్ మెగా అభిమానులను సినిమాపై మరింత అంచనాలను పెంచేలా చేస్తోంది. మరి ఈ కుర్ర డైరెక్టర్ చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

Mega 158: బెంచ్ మార్క్ సెట్ చేయడానికి మళ్లీ వస్తున్న బాబీ- చిరు

Chiranjeevi: ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

Updated Date - Aug 22 , 2025 | 08:06 PM