Mega 158: బెంచ్ మార్క్ సెట్ చేయడానికి మళ్లీ వస్తున్న బాబీ- చిరు

ABN , Publish Date - Aug 22 , 2025 | 07:09 PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాడు. నేడు చిరు తన 70 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే.

Mega 158

Mega 158: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాడు. నేడు చిరు తన 70 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క చిరు నటించిన సినిమాల నుంచి కొత్త పోస్టర్స్, అప్డేట్స్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. ఇప్పటికే విశ్వంభర నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మెగా అనిల్ టైటిల్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు.


ఇక ఈ రెండు సినిమాలు కాకుండా మెగా 158 ని కూడా నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి చిరంజీవి.. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నేడు చిరు బర్త్ డే రోజున కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాను అధికారికంగా ప్రకటించారు.


KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. 'మెగాస్టార్ తో కలిసి రెండోసారి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. Mega158 అన్ని అంశాలలో ఒక ర్యాంపేజ్ గా ఉండబోతోంది. ఈ భారీ ప్రయాణాన్ని అభిమానులందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్ డే ది బ్లడీ బెంచ్ మార్క్' అంటూ రాసుకొచ్చాడు. ఇక పోస్టర్ లో ఒక గొడ్డలి.. దానిపై విధ్వంసం వస్తోంది అని బెంగాలీలో రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Aug 22 , 2025 | 07:10 PM