సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Venkatesh: చెప్పుతో ఆయన్ను కొట్టుకొని.. ఆ తరువాత నటుడిని కొట్టిన వెంకటేష్

ABN, Publish Date - Sep 18 , 2025 | 07:32 PM

విక్టరీ వెంకటేష్ (Venkatesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Venkatesh

Venkatesh: విక్టరీ వెంకటేష్ (Venkatesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఇన్నేళ్ళు టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో వెంకీనే. ఇక ప్రతి ఒక్క హీరోకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ, వెంకీ మాత్రం అందరి హీరోల ఫ్యాన్స్ సమానంగా ఉంటారు. ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెంకీ మనసు కూడా అంతే ప్రత్యేకం. సెట్ లో చిన్నా పెద్దా అనే తేడా ఆయన ఏరోజు చూపించలేదని ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.


తాజాగా నటుడు వశిష్ట మరోసారి వెంకీ మామ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట తెలుగులో మంచి నెగిటివ్ రోల్స్ ను అందుకుంటున్నాడు. ముఖ్యంగా ఓదెల 2 లో వశిష్ట విలనిజానికి ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న వశిష్ట తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ గొప్ప మనసు గురించి చెప్పుకొచ్చాడు. వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో వశిష్ట ఒక కీలక పాత్రలో నటించాడు.


నారప్ప సినిమాలో వశిష్ట ను వెంకటేష్ చెప్పుతో కొట్టాలసిన సీన్ ఒకటి ఉంటుంది. అయితే అతడిని చెప్పుతో కొట్టడానికి వెంకీ చాలాసేపు ఆలోచించాడట. ' నన్ను వెంకటేష్ గారు చెప్పుతో గట్టిగా కొట్టాలి. దని కోసం డమ్మీ చెప్పు తీసుకొచ్చారు. అయినా అది కూడా నాకు తగులుతుందేమో అని ముందుగా ఆయనను ఆయనే కొట్టుకొని చూశారు. ఆ తరువాత సీన్ లో కూడా కొట్టడానికి ముందు సంకోచించారు. నేనే పర్లేదు సార్ కొట్టండి అని చెప్పి ఏదో విధంగా ఆ సీన్ ను ఫినిష్ చేశాం. ఒక పెద్ద స్టార్ అలా చేస్తారని నేను అనుకోలేదు


ఒక స్టార్ హీరో అయ్యి ఉండి, చిన్న యాక్టర్ కి సంబంధించిన షాట్ కోసం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ, వెంకీ సార్ ఆలోచించారు. చిన్న నటుడికి కూడా దెబ్బ తగులుతుందని ఆలోచించారు. అది ఆయనలోని గొప్ప విషయం. ఆయనతో నారప్ప చేయడం వలన ఎన్నో విషయాలను నేర్చుకున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Manchu Lakshmi: నాకు సపోర్ట్‌ చేసినవాళ్లు మచ్చుకు కూడా లేరు..

Vrusshabha: దీపావళికి వారియర్ కింగ్ గా మోహన్ లాల్

Updated Date - Sep 18 , 2025 | 07:32 PM