సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ustaad Bhagat Singh Update: హరీశ్‌ స్పీడ్‌ మామూలుగా లేదుగా.. అప్పుడే మొదలెట్టేశాడు..

ABN, Publish Date - Aug 10 , 2025 | 06:53 PM

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మంచి జోష్‌ మీదున్నారు. పవర్‌ స్టార్‌  పవన్‌ కళ్యాణ్‌ డేట్స్‌ ఇవ్వడం ఆలస్యం..  క్షణం తీరిక లేకుండా సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు.


దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మంచి జోష్‌ మీదున్నారు. పవర్‌ స్టార్‌  పవన్‌ కళ్యాణ్‌ డేట్స్‌ ఇవ్వడం ఆలస్యం..  క్షణం తీరిక లేకుండా సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఎక్స్‌ప్రెస్‌ స్పీడులో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ షూటింగ్‌ చేశారు. ఇప్పుడు సినీ కార్మికుల సమ్మె ఇతర కారణాలతో కాస్త గ్యాప్‌ దొరకడంతో టక్కున పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టేశారు. ‘ఓజీ’ చిత్రీకరణ పూర్తి చేసిన అనంతరం పవన్‌ 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' చిత్రానికి డేట్స్‌ కేటాయించారు. మధ్యలో 'హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్‌ వల్ల కొంత గ్యాప్‌ తీసుకున్నా.. గడిచిన నెల రోజులు చాలా వరకూ షూటింగ్‌ పూర్తి చేశారు. ఇంకా పవన్‌ పాత్రకు సంబంధించి ఒక వారం మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేశామని నిర్మాత నవీన్‌ యెర్నేని ఓ సందర్భంలో చెప్పారు. మరో పది పదిహేను రోజులు షూటింగ్‌ చేస్తే సినిమా పూర్తవుతుందని చెప్పారు.

తాజాగా ఈ చిత్రం గురించి మేకర్స్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘క్లాప్‌ బోర్ట్‌ పని పూర్తయిందని, వెండితెరపై సినిమా చూసి క్లాప్స్‌ కొట్టే పని తరువాయి అన్నట్లుగా మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఎడిటింగ్‌ వర్క్‌ మొదలుపెట్టారు హరీశ్‌ శంకర్‌. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు అలరించాయి. తాజాగా వీరమల్లు ప్రమోషన్స్‌లో పవన్‌ లుక్‌ చూసి అంతా ఆశ్చర్యపోయారు. మరింత యంగ్‌ అండ్‌ హ్యాండ్సమ్‌గా ఉన్నారని కామెంట్స్‌ చేశారు. ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. 

Updated Date - Aug 10 , 2025 | 06:55 PM