Ustaad Bhagat Singh- Harish Shankar : ట్వీట్‌కు ఘాటు స్పందన!

ABN , First Publish Date - 2023-03-26T15:39:34+05:30 IST

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను (Harish Shankar) ఉద్దేశించి ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు హరీశ్‌ తనదన శైలిలో స్పందించారు.

Ustaad Bhagat Singh- Harish Shankar : ట్వీట్‌కు ఘాటు స్పందన!

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను (Harish Shankar) ఉద్దేశించి ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు హరీశ్‌ తనదన శైలిలో స్పందించారు. తన ఫిల్మోగ్రఫీని, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ను ఉద్దేశించి ఉన్న ఆ ట్వీట్‌కు వివరణ ఇవ్వడానికి ఇది వేదిక కాదని హరీశ్‌ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! తమిళనాట సూపర్‌హిట్‌ అయిన ‘తెరి’ (Theri)చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్నట్లు టాక్‌. తాజాగా ఓ నెటిజన్‌ హరీశ్‌ శంకర్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు.

ఎన్నో హిట్స్‌ ఇచ్చిన మీరు మూడేళ్ల తర్వాత తీసే సినిమాకు రీమేక్‌ సెలెక్ట్‌ చేసుకోవడం ఏంటి’ అని ప్రశ్నించాడు. (Netizen Question to Harish shankar)

‘‘షాక్‌ - ఫ్లాప్‌,

మిరపకాయ్‌ - సూపర్‌హిట్‌,

గబ్బర్‌సింగ్‌ - బ్లాక్‌బస్టర్‌, (Baggar singh)

రామయ్యా వస్తావయ్యా - ఫ్లాప్‌,

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌- సూపర్‌ హిట్‌,

దువ్వాడ జగన్నాథమ్‌ - హిట్‌,

గద్దలకొండ గణేశ్‌ - హిట్‌.. (Gaddalakonda ganesh)

కథ రాయడంలో అద్భుతమైన టాలెంట్‌ ఉన్న హరీశ్‌ శంకర్‌ మూడేళ్లు సమయం తీసుకుని రీమేక్‌ను తెరకెక్కించడం ఏమిటి? ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ పొరుగింటి కథ అంటగా’ అని నెటిజన్‌ ప్రశ్నించాడు. దానిపై హరీశ్‌ స్పందించారు. ‘‘ట్విట్టర్‌ అనేది కేవలం భావాలను వ్యక్తం చేయడానికే కానీ వివరణ ఇవ్వడానికి ఇది వేదిక కాదు’’ అని కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొంతమంది మాత్రం.. ‘‘సర్‌. ఇది రీమేక్‌ యేనా’’ అని అడుగుతున్నారు

Updated Date - 2023-03-26T15:39:35+05:30 IST