Andhra King Taluka: సెట్స్ లో సూపర్ స్టార్ సూర్యకుమార్

ABN , Publish Date - May 24 , 2025 | 07:28 PM

రామ్ హీరోగా నటిస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీలో ఉపేంద్ర సూపర్ స్టార్ సూర్యకుమార్ పాత్రను పోషిస్తున్నాడు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఉపేంద్ర పాల్గొన్నాడు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' (Andhra King Taluka). మహేష్ బాబు పి (Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ గ్లింప్స్‌లో సినిమా పట్ల విపరీతమైన అభిమానం ఉన్న యువకుడిగా రామ్ పోతినేని పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్లింప్స్‌లో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర (Upendra) భారీ కటౌట్ రూపంలో కనిపించి మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.


ఈ చిత్రంలో ఉపేంద్ర పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని, ఇటీవల విడుదలైన ఆయన క్యారెక్టర్ పోస్టర్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిందని, పాత్రల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇచ్చే ఉపేంద్ర, ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌ లో జాయిన్ అయ్యారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ఉపేంద్ర సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నారు.

అయితే సినిమా టైటిల్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' అని పెట్టి... ఇందులో ఆంధ్రా కింగ్ గా ఉపేంద్రను ఎంపిక చేయడం ఎంతవరకూ సబబు అంటూ చర్చకూడా సోషల్ మీడియాలో జోరుగానే సాగుతోంది. ఉపేంద్ర పలు తెలుగు సినిమాల్లో నటించినా, ఆయన్ని కన్నడ స్టార్ గానే మనవాళ్ళు గుర్తిస్తారు. తెలుగులో ఉపేంద్ర స్థాయి, దానిని మించిన ఇమేజ్ ఉన్న సీనియర్స్ ఉండగా ఉపేంద్ర ను ఎంపిక చేయడం పట్ల కొందరు కినుక వహించారు. మరికొందరైతే... ఏ తెలుగు సీనియర్ హీరోను తీసుకున్నా... ఫ్యాన్స్ మధ్య ఇగో క్లాషెస్ ఖాయమని, అందుకే ముందు చూపుతో దర్శక నిర్మాతలు ఉపేంద్రను ఎంపిక చేశారని సర్దిచెప్పుకున్నారు. ఏదేమైనా సినిమా చూడకుండానే ఉపేంద్రను తీసుకోవడం సబబు కాదని విమర్శించడం కరెక్ట్ కాదనే వారూ లేకపోలేదు.


రామ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సిద్ధార్థ నూని వ్యవహరిస్తుండగా, వివేక్–మర్విన్ సంగీత దర్శకులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Also Read: Spirit: యానిమల్ బ్యూటీతో మరోసారి సందీప్ రెడ్డి

Also Read: Kollywood: చియాన్ విక్రమ్ సరసన మీనాక్షి చౌదరి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 24 , 2025 | 07:28 PM