Sravanthi Ravi Kishore: రామ్ తో ఎట్టకేలకు త్రివిక్రమ్ సినిమా!

ABN, Publish Date - Jun 09 , 2025 | 01:18 PM

రామ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా నిర్మించాలని స్రవంతి రవికిశోర్ ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్నారు. ఆ దిశగానే ఇప్పుడు వీరి అడుగులు పడబోతున్నాయని తెలుస్తోంది.

Sravanthi Ravi Kishore: రామ్ తో ఎట్టకేలకు త్రివిక్రమ్ సినిమా!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ను దర్శకుడు చేసింది ప్రముఖ నిర్మాత స్రవంతి మూవీస్ రవికిశోర్ (Ravikishore). మాటల రచయితగా తమ బ్యానర్ లో మంచి సినిమాలు చేసి, హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ను 'స్రవంతి' రవికిశోర్ 'నువ్వే నువ్వే' (Nuvve Nuvve) మూవీతో దర్శకుడిని చేశాడు. తరుణ్ (Tarun), శ్రేయ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ కమర్షియల్ గా గ్రాండ్ విక్టరీని అందుకోలేదు కానీ ఫర్వాలేదనిపించుకుంది. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ ను డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ డామినేట్ చేశాడనే విమర్శలు వచ్చాయి. ఈ సినిమా రిజల్డ్ తో సంబంధం లేకుండా 'స్రవంతి' రవికిశోర్, త్రివిక్రమ్ మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. తన తమ్ముడు కొడుకైన రామ్ (Ram) తో 'స్రవంతి' మూవీస్ రవికిశోర్ పలు చిత్రాలు నిర్మించారు. అంతేకాదు... అందులో కొన్ని మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. సో... త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధం కారణంగా అతని డైరెక్షన్ లో రామ్ హీరోగా ఓ మూవీ నిర్మించాలని రవికిశోర్ అనుకుంటూ ఉన్నారు. స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్ రామ్ తో మూవీ చేస్తాడా అనే సందేహం కూడా కొందరికి లేకపోలేదు. అయితే... కథానుగుణంగానే త్రివిక్రమ్ హీరోలను ఎంపిక చేసుకుంటాడు తప్పితే... పని కట్టుకుని స్టార్స్ తోనే చేయడనే వాదన కూడా ఉంది. దానికి ఉదాహరణగా వారు త్రివిక్రమ్... నితిన్ (Nithin) కాంబోలో వచ్చిన 'అ... ఆ' సినిమాను గురించి చెబుతున్నారు. పైగా రవికిశోర్ తో ఉన్న బంధం కారణంగా రామ్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ కూడా ఆసక్తి చూపుతున్నాడట.


నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్... అల్లు అర్జున్ (Allu Arjun) తో మూవీ చేయాలి. అతనేమో అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలానే రామ్ చరణ్ తో మూవీ చేద్దామంటే... చెర్రీ 'పెద్ది' మూవీ షూటింగ్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పటికే ప్రకటించిన సుకుమార్ మూవీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. సో... ప్రస్తుతం వెంకటేశ్ తో మూవీ చేయడానికి రెడీ గా ఉన్న త్రివిక్రమ్ అది పూర్తి కాగానే... రామ్ తో సినిమా చేస్తాడని, ఆ తర్వాతే అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ తో మూవీ ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి ఈ సినిమాలు ఎప్పుడు, ఎలా మొదలవుతాయో చూడాలి.

Also Read: Jyothika: జ్యోతిక వర్సెస్ సోనాక్షి.. కోర్టులో గెలిచేది ఎవరు..?

Also Read: Stolen OTT Review: స్టోలెన్ మూవీ వణుకు పుట్టించిందా.. ఎలా ఉందంటే?

Also Read: Mahesh Babu : విక్రమ్ స్థానంలో మాధవన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 09 , 2025 | 01:26 PM