Usaad Bhagat Singh: ఒకే ఫ్రేమ్ లో ఉస్తాద్ భామలు.. భలే ముద్దుగున్నారు

ABN , Publish Date - Sep 07 , 2025 | 07:18 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ (Usaad Bhagat Singh) ఒకటి.

Ustaad Bhagat Singh

Usaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ (Usaad Bhagat Singh) ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా (Raashii Khanna), శ్రీలీల (Sreeleela)హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది.


తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ కాదు కానీ, ఒక చిన్న సర్ ప్రైజ్ ను హీరోయిన్ రాశీ ఖన్నా అభిమానులతో పంచుకుంది. అదేంటంటే.. ఉస్తాద్ షూటింగ్ లో అమ్మడితో పాటు మరో బ్యూటీ శ్రీలీల కూడా ఎంట్రీ ఇచ్చింది. అంటే షూటింగ్ లో ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి కనిపించారు. ఇక శ్రీలీలతో సెల్ఫీ దిగి రాశీ ఖన్నా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ఉస్తాద్ షూటింగ్ లో ఉన్నాను.. ఈ క్యూటీ సెట్ కి వచ్చింది అంటూ శ్రీలీలను ట్యాగ్ చేసింది. ఇక ఇద్దరు క్యూటిస్ సింగిల్ ఫ్రేమ్ లో కనిపించేసరికీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.


పవన్ ఫ్యాన్స్ ఉస్తాద్ పై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం ఇప్పటికే పవన్ - హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చింది. అంతటి హిట్ ను హరీష్.. మరోసారి అందుకోవాలని చూస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్.. తమిళ్ సూపర్ హిట్ సినిమా తేరికి రీమేక్ అని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్.. సినిమాపై హిప్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమాతో హరీష్.. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి మరో హిట్ ను అందిస్తాడేమో చూడాలి.

Simran: గుర్తుపట్టలేనంతగా మారిన సిమ్రాన్..

Nithiin: కొడుకు తొలి బర్త్‌డే.. హీరో నితిన్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Updated Date - Sep 07 , 2025 | 07:18 PM