Tribanadhari Barbarik: డేట్ మారింది.. మంచి థియేటర్ల కోసమే.. 

ABN , Publish Date - Aug 19 , 2025 | 09:41 AM

‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ముందు అనుకున్న విడుదల తేదీ మారింది

‘త్రిబాణధారి బార్బరిక్’(Tribanadhari Barbarik) సినిమా విడుదల తేదీ ఖరారైంది.  దర్శకుడు మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై  విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ చిత్రం  ఆగస్ట్ 29న భారీ ఎత్తున విడుదల కానుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రను పోషించగా.. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి.

Udayabahnu.jpg

ట్రైలర్లో. విజువల్స్, ఆర్ ఆర్ ఇలా అన్నీ కూడా అలరించాయి. మోహన్ శ్రీవత్స మేకింగ్, ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి పెంచింది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మొదటి ప్రాజెక్ట్ అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రానికి కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్ అందరినీ ఆశ్చర్య పరిచేలా ఉన్నాయి.   ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఆగస్ట్ 22న విడుదల కావాల్సి ఉంది. కానీ సరైన రిలీజ్ డేట్, కావాల్సినన్నీ థియేటర్లు లభించడం కోసం ఆగస్ట్ 29కి వాయిదా వేశారు. ఇక ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఆగస్ట్ 29న గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

Updated Date - Aug 19 , 2025 | 09:46 AM