Sankranti Releases:సంక్రాంతికి త్రిముఖ పోటీ
ABN, Publish Date - Jun 07 , 2025 | 03:07 PM
సంక్రాంతికి పందెంకోళ్లు అప్పుడే రెడీ అయిపోతున్నాయి. ఆరు నెలల సమయం ఉన్నా.. సెట్స్ పై ఉండగానే డేట్లపై కర్చీఫ్‌లు వేసుకుంటున్నాయి. క్రేజీ అండ్ రేర్ కాంబోస్ ఈ సారి బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నాయి. దీంతో పొంగల్ ఫైట్ రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
సంక్రాంతి (Sankranti) అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి జాక్‌పాట్ సీజన్. ఈ టైంలో సినిమా రిలీజ్ చేస్తే.. చిన్నదైనా, పెద్దదైనా కనీసం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు పొంగల్ కోసం ఏడాది ముందు నుంచే స్కెచ్ వేస్తారు. ఇటు మేకర్స్ సైతం ఏ సమస్య ఉన్నా సరే.. ఎంత కష్టమైనా సరే పండగను క్యాష్ చేసుకునేందుకు పోటీపడుతుంటారు. దీంతో ఇప్పటి నుంచే 2026 సంక్రాంతి బాక్సాఫీస్ బిజీగా కనిపిస్తోంది.
2026 సంక్రాంతి రేసులో నాలుగు బడా మూవీస్ లైన్‌లో ఉన్నాయి. చిరంజీవి (Chiranjeevi) - అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వస్తున్న సినిమా పొంగల్ బరిని టార్గెట్ చేసుకొనే తెరకెక్కుతోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ‘అనగనగా ఒకరాజు(Anaganaga Oka Raju)’తో సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), కిశోర్ తిరుమల (Kishore Tirumala ) కాంబోలో ‘అనార్కలి’ (Anarkali) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా కూడా పొంగల్ బరిలోనే దూకనుంది. అంతేకాక తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ( Thalapathy Vijay) నటిస్తున్న ఆఖరి మూవీ 'జన నాయకన్' (Jana Nayagan)కూడా సంక్రాంతికే రాబోతోంది. అంటే ఇప్పటికైతే నాలుగు సినిమాలు బర్త్ ను కన్ఫామ్ చేసుకున్నాయి. అయితే ఈ రేస్ లోకి మరికొన్ని సినిమాలు జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎలా చూసినా పొంగల్ పోరులో నాలుగైదు సినిమాలు రావడం గ్యారెంటీ అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... బాలకృష్ణ (Balakrishna) -బోయపాటి (Boyapati )కాంబోలో వస్తున్న 'అఖండ 2' (Akhanda 2) మూవీ కూడా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మొదట దసరాకు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు పొంగల్ బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రెజెంట్ జార్జియాలో బాలయ్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట బోయపాటి. చూస్తుంటే పండక్కి చిరు, బాలయ్య, రవితేజ మధ్య టఫ్ ఫైట్ ఉండేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రవితేజ మూవీ రీసెంట్ గా మొదలు కాగా... నవీన్ సినిమా చివరి దశకు చేరుకుంది. సో... ఈ లెక్కన 2026 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండేలా లేదు.