Bahubali The Epic: అయ్యయ్యో.. బంగారం లాంటి పాటలన్నింటిని లేపేశారంటనే
ABN, Publish Date - Oct 29 , 2025 | 06:49 PM
బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic) సినిమాకు కొందరు ప్రభాస్(Prabhas) కోసం వెళ్తారు.. మరికొందరు అనుష్క (Anushka) కోసం.. ఇంకొందరు తమన్నా కోసం వెళ్తారు.
Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic) సినిమాకు కొందరు ప్రభాస్(Prabhas) కోసం వెళ్తారు.. మరికొందరు అనుష్క (Anushka) కోసం.. ఇంకొందరు తమన్నా కోసం వెళ్తారు. కానీ.. కొందరు కేవలం సాంగ్స్ కోసం వెళ్తారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 లలో ఉన్న సాంగ్స్ అలాంటివి. ముఖ్యంగా పచ్చబొట్టేసినా సాంగ్ ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ - తమన్నా మధ్య రొమాన్స్ వేరే లెవెల్.. అప్పట్లో చాలామంది ఈ సాంగ్ కోసమే వెళ్లారు అని చెప్పొచ్చు.
ఇక పచ్చబొట్టు తరువాత బాహుబలిలో చెప్పుకో తగ్గ సాంగ్ మనోహరీ.. ఐటెంసాంగ్స్ లోనే హైలైట్ సాంగ్ అని చెప్పొచ్చు. ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ డ్యాన్స్ చూస్తే రెండు కళ్లు చాలవు అంతే. ఈ రెండు సాంగ్స్ పార్ట్ 1 లోవి అయితే.. కన్నా నిదురించారా సాంగ్ పార్ట్ 2 లో హైలైట్ సాంగ్. అనుష్క అందం ఆ సాంగ్ లో వర్ణించలేం. ఎంతోమంది అమ్మాయిలకు స్వీటీ లుక్ అంటే ప్రాణం అని చెప్పొచ్చు.
ఎన్నో ఏళ్ళ తరువాత బాహుబలి ది ఎపిక్ లో ఇవన్నీ మళ్లీ చూడొచ్చు అనుకుంటే పొరపడినట్టే. ఈ ఎపిక్ లో ఈ సాంగ్స్ ఏవి కనిపించవు. రన్ టైమ్ తగ్గించడానికి రెండు భాగాలలోని కొన్ని సీన్స్ ను జక్కన్న కత్తిరించాడు. ఆ కత్తిరింపుల్లో ఈ మూడు సాంగ్స్ లేపేశారంట. ఈ విషయాన్నీ జక్కన్ననే స్వయంగా చెప్పాడు. వీటితో పాటు కొన్ని యుద్ధ సన్నివేశాలు, మరికొన్ని సీన్స్ కట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయ్యయ్యో బంగారం లాంటి సాంగ్స్ అన్నింటిని కట్ చేశారే.. సినిమా మొత్తం యుద్దాలు ఉంటే ఎలా ఇలాంటి సాంగ్స్ ఉంటేనే కదా బావుంటుంది అని చెప్పుకొస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పార్ట్ 1 ఉంటుందట.. సెకండాఫ్ పార్ట్ 2 కీలక సన్నివేశాలతో కొన్ని సీన్స్ ను యాడ్ చేసి ఎడిట్ చేసినట్లు తెలిపాడు. మరి ఈ మూడు సాంగ్స్ లేని బాహుబలి ది ఎపిక్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Mahesh Babu: హీరోయిన్‌గా.. మహేశ్‌బాబు మేన కోడలు! ఎంట్రీకి రంగం సిద్ధం
Brahmanandam: హాస్య బ్రహ్మకు సూర్యకాంతం స్మారక పురస్కారం