Mahesh Babu: హీరోయిన్‌గా.. మ‌హేశ్‌బాబు మేన కోడలు! ఎంట్రీకి రంగం సిద్ధం

ABN , Publish Date - Oct 29 , 2025 | 10:43 AM

సినిమాల్లోకి మ‌రో స్టార్ వార‌సురాలు ఎంట్రీకి రంగం సిద్ద‌మైంది. సూప‌ర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) కుటుంబం నుంచి తొలిసారి హీరోయిన్ రంగ ప్ర‌వేశం చేస్తుంది.

jaanvi

సినిమాల్లోకి మ‌రో స్టార్ వార‌సురాలు ఎంట్రీకి రంగం సిద్ద‌మైంది. సూప‌ర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) కుటుంబం నుంచి తొలిసారి హీరోయిన్ రంగ ప్ర‌వేశం చేస్తుంది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) సోద‌రి , నిర్మాత మంజుల (Manjula Ghattamaneni) కూతురు జాన్వీ స్వ‌రూప్ (Jaanvi) క‌థానాయిక‌గా తెరపైకి రానున్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతూ సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

2010లో సందీప్ కిష‌న్ హీరోగా మంజుల ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌న‌సుకు న‌చ్చింది (Manasuku Nachindi) సినిమాతో 10 ఏండ్ల వ‌య‌సులోనే బాట న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ ఆపై త‌న కెరీర్‌పై దృష్టి పెట్టి ఉన్న‌త చ‌దువులు పూర్తి చేసి డ్యాన్స్ ఇత్యాది అన్ని రంగాల్లో తర్ఫీదు తీసుకుని మ‌ల్టీ టాలెంటెడ్ అని అనిపించుకుంది.

jaanvi

అయితే.. సినిమాలలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న‌ట్లుగా తాజాగా చేసిన గ్లామ‌ర్ ఫొటో షూట్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. జాన్వీ గ‌తంలో మ‌న‌కు కనిపించిన దానికి విరుద్దంగా పూర్తిగా ఔట్ అండ్ ఔట్ స్టైల్‌, లుక్ మార్చి స‌రికొత్త‌గా ట్రెండింగ్ వేర్‌లో వివిధ డ్రెస్సింగ్ల‌తో ద‌ర్శ‌ణ‌మిచ్చి కృష్ణ‌, మ‌హేశ్ బాబు అభిమానుల‌ను, నెటిజ‌న్ల‌ను ఒకింత ఆశ్య‌ర్యానికి గురి చేసింది. ఆ ఫొటోల‌ను చూసిన వారంతా కృష్ణ మ‌నుమ‌రాలు ఏంటి ఇంత చేంజ్ అయింది. నిజంగా మ‌నం చూసేది జాన్వీనేనా అంటూ స్ట‌న్ అవుత‌న్నారు.

WhatsApp Image 2025-10-29 at 9.53.51 AM (2).jpeg

ఇదిలాఉంటే.. మ‌రోవైపు కృష్ణ కుమారుడు దివంగ‌త ర‌మేశ్ బాబు వార‌సులు జ‌మ‌కృష్ణ‌, సైతం హీరో హీరోయున్లుగా వేర్వేరు చిత్రాల‌తో ఎంట్రీ ఇస్తున్న స‌మాచారం తెలిసిందే. ఇది ఇలా ఉండ‌గానే ఇప్పుడు జాన్వీ కూడా సిద్ధ‌మ‌వుతుండ‌డంతో కృష్ణ‌, మ‌హేశ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెల‌కొంది.

Updated Date - Oct 29 , 2025 | 11:24 AM