Swasika: రామ్ చరణ్ మూవీనే రిజెక్ట్ చేశా.. తమ్ముడు బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:04 PM
ఒక నటి కానీ, నటుడు కానీ, ఒక పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకుంటే.. ఆ తరువాత నుంచి వారికి అలాంటి పాత్రలే వస్తాయి. వారు ఇక ఆ పాత్రలకు మాత్రమే పరిమితం అని లెక్క కట్టేస్తారు.
Swasika: ఒక నటి కానీ, నటుడు కానీ, ఒక పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకుంటే.. ఆ తరువాత నుంచి వారికి అలాంటి పాత్రలే వస్తాయి. వారు ఇక ఆ పాత్రలకు మాత్రమే పరిమితం అని లెక్క కట్టేస్తారు. ఒక హీరోయిన్ డీ గ్లామర్ రోల్ చేస్తే.. ఆ తరువాత నుంచి అలాంటి పాత్రలే చేయమని అడుగుతుంటారు. అలాగే ఒక నటి తల్లి పాత్ర చేస్తే ఆమె వయస్సుతో సంబంధం లేకుండా అలాంటి ఛాన్స్ లే వస్తాయి. తాజాగా మలయాళ బ్యూటీ స్వసిక(Swasika) కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
స్వసిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న లబ్బరు పందు సినిమా ఓటీటీలో తెలుగులో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా స్వసిక నటన తెలుగువారిని కట్టిపడేసింది. ఇక ఆ గుర్తింపుతోనే ఈ చిన్నదానికి తెలుగులో నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. తమ్ముడు సినిమా అమ్మడికి ఆశించిన పాలితాన్ని అందివ్వలేకపోయినా.. తెలుగు ప్రేక్షకుల కంట్లో అయితే పడేలా చేసింది.
ఇక తాజాగా స్వసిక ఒక ఇంటర్వ్యూలో తెలుగులో ఒక పెద్ద అవకాశం వస్తే దాన్ని వదులుకున్నట్లు తెలిపింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో అమ్మడికి ఛాన్స్ వచ్చిందంట. ఏంటి అంతా మంచి ఛాన్స్ ను స్వసికకు వచ్చిందా.. ? మరి ఎందుకు వదిలేసింది.. ? అసలు ఎలాంటి పాత్ర అంటే.. లబ్బరు పందు సినిమాలో తల్లి పాత్ర నచ్చి.. పెద్దిలో చరణ్ కు తల్లిగా నటించమని చిత్రబృందం అడిగారట. చరణ్ కన్నా చిన్న వయస్సు ఉన్న తాను తల్లి పాత్ర చేయడం తన మనసుకు నచ్చక నో చెప్పినట్లు ఆమె తెలిపింది.
'లబ్బరు పందు సినిమాలో నేను తల్లి పాత్ర చేయడంతో ఏకంగా నాకు పెద్ది చిత్రంలో హర్వకు తల్లిగా అవకాశం వచ్చింది. క్యారెక్టర్ బావుందని నేను ఆ పాత్రకు ఓకే చెప్తే నా కెరీర్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. కానీ, ప్రస్తుతం తల్లి పాత్రలు నేను చేయాలనుకోవడం లేదు. మరోసారి అలాంటి పాత్రలు వచ్చినప్పుడు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్వసిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా ఆలోచించి ఆమె బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Ufff Yeh Siyapaa: అనుష్క భాగమతి దర్శకుడి.. హిందీ మూకీ చిత్రం! థియేటర్లకు ఎప్పుడంటే
Karan Johar: కామెడీ డ్రామాలో తమన్నా