సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: భర్తలు దర్శకులు.. భార్యలు నిర్మాతలు.. అదిరిపోయిన కాంబో

ABN, Publish Date - Oct 25 , 2025 | 09:23 PM

దర్శకుల భార్యల్లో కొందరు సినిమాలకు కథలు సమకూర్చిన సందర్భాలు చూశాం. మరి కొందరు కాస్ట్యూమ్ డిజైనర్స్ గా రాణించిన వైనాలూ ఉన్నాయి.

Tollywood

Tollywood: దర్శకుల భార్యల్లో కొందరు సినిమాలకు కథలు సమకూర్చిన సందర్భాలు చూశాం. మరి కొందరు కాస్ట్యూమ్ డిజైనర్స్ గా రాణించిన వైనాలూ ఉన్నాయి. ఇంకొందరు సినిమా నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) భార్య ప్రియాంక దత్ (Priyanka Dutt). ఎందుకంటే ప్రియాంక తండ్రి సి.అశ్వనీదత్ టాలీవుడ్ లో ప్రఖ్యాత నిర్మాత. ఆయన నుండే వారసత్వంగా ప్రియాంక, ఆమె సోదరి స్వప్న నిర్మాతలుగా మారి 'త్రీ రోజెస్' బ్యానర్ పై కొన్నిసినిమాలు నిర్మించారు. ప్రస్తుతం తమ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తమ తండ్రి నిర్మించే చిత్రాలకు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడంలో స్వప్న, ప్రియాంక బిజీగానే ఉన్నారు.


ప్రముఖ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ భార్య లక్ష్మీ సౌజన్య చాలా కాలం నుంచీ నిర్మాతగా ఉన్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో పాటు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ను స్థాపించి సూర్యదేవర నాగవంశీతో కలసి లక్ష్మీ సౌజన్య చిత్రాలు నిర్మిస్తూన్నారు. ఇప్పటికే డీజే టిల్లు, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో హిట్ అందుకున్నారు. ఆ తీరున ఈ మధ్య కాలంలో వరుసగా చిత్రాలు నిర్మించిన డైరెక్టర్ భార్యగా లక్ష్మీ సౌజన్యనే బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.. త్వరలోనే లక్ష్మీ సౌజన్య నిర్మించిన రవితేజ 'మాస్ జాతర' జనం ముందుకు రాబోతోంది.


'పుష్ప' సిరీస్ తో ఆల్ ఇండియాను ఆకట్టుకున్న సుకుమార్ సైతం తన భార్య తబితను చిత్ర నిర్మాణంలో ఎంటర్ చేయిస్తున్నారట. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై గతంలో రూపొందిన 'కుమారి 21 ఎఫ్' మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా 'కుమారి 22 ఎఫ్' రానుందట... ఆ సినిమాకే తబిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారని టాక్. తబిత చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో రావు రమేశ్ ప్రధాన పాత్రగా రూపొందిన 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' సినిమాకు సమర్పకురాలుగా తబిత వ్యవహరించారు.


అలానే గతంలో బొమ్మరిల్లు వారి బ్యానర్ లో వచ్చిన సినిమాలకు సమర్పకురాలిగా ఉన్న ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి భార్య యలమంచిలి గీత ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాకు, సరికొత్త బ్యానర్ పెట్టి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏది ఏమైనా ప్రియాంక, లక్ష్మీ సౌజన్య , తబిత, గీత ను చూసి మునుముందు ఇంకా ఎవరైనా దర్శకుల భార్యలు చిత్ర నిర్మాణంలో అడుగు పెడతారేమో చూడాలి.

Mass Jathara: మాస్ జాతర.. ఒకరోజు వెనక్కి

Tollywood Heroines: సీనియర్ హీరోస్ అయినా పర్లేదు అంటున్న కుర్ర హీరోయిన్లు

Updated Date - Oct 25 , 2025 | 09:23 PM