Mass Jathara: మాస్ జాతర.. ఒకరోజు వెనక్కి
ABN , Publish Date - Oct 25 , 2025 | 08:16 PM
మాస్ మహారాజా రవితేజ (Raviteja), శ్రీలీల(Sreeleela) జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర(Mass Jathara).
mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Raviteja), శ్రీలీల(Sreeleela) జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర(Mass Jathara). సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మాస్ జాతర ఇప్పటికీ మూడు సార్లు రిలీజ్ డేట్ ను ప్రకటించి వాయిదా పడింది.
అన్ని వాయిదాల తరువాత అక్టోబర్ 31 న మాస్ జాతర రిలీజ్ కు సిద్దమవుతుంది. కానీ, ఆరోజు కూడా మాస్ జాతర రిలీజ్ కావడం లేదు. అదేంటీ మళ్లీ వాయిదానా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కరోజు వెనక్కి వెళ్తుంది అని అంటున్నారు. అంటే అక్టోబర్ 31 న రావాల్సింది.. నవంబర్ 1 న వస్తుంది అని టాక్ నడుస్తోంది.
మాస్ జాతర ఒకరోజు వెనక్కి వెళ్ళడానికి కారణం బాహుబలి ది ఎపిక్ అని తెలుస్తోంది. అక్టోబర్ 31 న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అవుతుంది. ఎంత రీ రిలీజ్ అయినా కూడా జక్కన్న ఈ సినిమాను మరో కొత్త సినిమాగా రిలీజ్ చేస్తున్నాడు. రెండు భాగాలను ఒకే సినిమా కింద మార్చి.. కొత్త సీన్స్ యాడ్ చేసి సరికొత్తగా రిలీజ్ చేయడంతో అభిమానులు దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
ఇక బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్స్ అక్టోబర్ 30 న ఉండబోతుంది. అందుకే అదే రోజు కాకుండా అక్టోబర్ 31 న మాస్ జాతర పైడ్ ప్రీమియర్స్ పెట్టుకొని.. నవంబర్ 1 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. నిజం చెప్పాలంటే ఇది కూడా రవితేజకు కలిసి వచ్చే విషయమే. బాహుబలితో ఎలాంటి పోటీ లేకుండా ఒక రోజు వెనుక వస్తే సింగిల్ గా వచ్చినట్లు ఉంటుంది. ముందు రోజు బాహుబలిని చూసిన అభిమానులు.. మాస్ జాతర టాక్ నచ్చితే నెక్స్ట్ డేనే థియేటర్ కు వస్తారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Tollywood Heroines: సీనియర్ హీరోస్ అయినా పర్లేదు అంటున్న కుర్ర హీరోయిన్లు
Fauzi : సీక్వెల్ స్టార్ గా మారిపోతున్న ప్రభాస్