సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood Heroines: రెండో పెళ్లికి మేము సిద్ధం..

ABN, Publish Date - Jul 17 , 2025 | 08:16 PM

ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్నిరోజులు ఉంటాయి అనేది చెప్పడం కష్టం. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా ప్రేమించి చేసుకున్న పెళ్లిళ్లే పెటాకులు అవుతున్నాయి.

Tollywood

Tollywood Heroines: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్నిరోజులు ఉంటాయి అనేది చెప్పడం కష్టం. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా ప్రేమించి చేసుకున్న పెళ్లిళ్లే పెటాకులు అవుతున్నాయి. ఇక ఎంత ఈజీగా విడిపోతున్నారో.. అంతే ఈజీగా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయినవారు ఉన్నారు. ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నవారు ఉన్నారు. విడాకులు తీసుకొని ఇక పెళ్లి వద్దు అనుకోని సింగిల్ గా మిగిలిపోయినవారున్నారు. విడాకుల అయిన రెండుమూడేళ్లకే రెండో పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యినవారున్నారు.


తాజాగా టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ రెండో పెళ్లికి సిద్ధమని చెప్పుకొస్తున్నారు. తమకు ఆశలు, కోరికలు ఉన్నాయని, కొత్త జీవితంలోకి రావాలని తహతహలాడుతున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందులో సమంత, రేణు దేశాయ్, నిహారిక కొణిదెల, మలైకా అరోరా, ఊర్మిళ మండోత్కర్ తదితరులు ఉన్నారు. వీరిలో కొంతమంది సింగిల్ మదర్స్ ఉన్నారు.. మరికొందరు కేవలం మూడు నాలుగేళ్లకే విడిపోయినవారు ఉన్నారు. వీరందరూ కూడా కొత్త జీవితానికి పునాదులు వేయడానికి సిద్దపడుతున్నారు.


రేణు దేశాయ్

బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రేణు దేశాయ్. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ కళ్యాణ్ ప్రేమలో పడి.. పెళ్ళికి ముందే అకీరాకు జన్మినిచ్చింది. ఆ తరువాత పెళ్లి చేసుకున్న ఈ జంట ఆద్య అనే మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఇక అంతా సెట్ అవుతుంది అనుకొనేలోపు వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడం.. ఇద్దరు పిల్లలను తీసుకొని ఆమె బయటకు వచ్చేసింది. ఇక రేణుతో విడాకుల తరువాత పవన్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రి. అయ్యాడు. ఎవరి దారులు వారివి వేరయ్యాకా.. కొత్త జీవితం కోసం రేణు కూడా చాలా ప్రయత్నాలు చేసింది. రెండోపెళ్లి చేసుకుంటాను అని ప్రకటించినప్పుడు ఆమెపై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతాకాదు. దీంతో రేణు రెండో పెళ్లి మాటను విరమించుకుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వారికి తన అవసరం చాలా ఉందనుకొని.. వారితోనే ఉండిపోయింది. ఇక ఇప్పుడు పిల్లలు చేతికి వచ్చారు. వారే.. రేణును రెండో పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారట. అందుకే రేణు.. రెండోపెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే తన కొత్త జీవితంలోకి రాబోయే వ్యక్తిని పరిచయం చేయనుంది.


సమంత

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి కొన్నేళ్లు డేటింగ్ చేసి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా అడుగుపెట్టింది. చై - సామ్ జంటకు ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. చై పక్కన ఉంటే సామ్ ముఖం ఎప్పుడు వెలిగిపోయేది. నాలుగేళ్లలో ఈ జంట ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులుగా మారుతున్నాం అని చెప్తారో అని ఎంతగానో ఎదురుచూసారు. కానీ, చివరకు విడిపోయామని ప్రకటించి ఫ్యాన్స్ గుండెలను ముక్కలు చేశారు. ఆ తరువాత రెండేళ్లు వేచి చూసి చైతన్య.. శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సామ్ వంతు. గత కొంతకాలంగా సామ్.. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పటివరకు చై పెళ్లి కోసం ఎదురుచూసిన సామ్ .. ఇప్పుడు ఆమె కూడా కొత్త జీవితంలోకి ఎప్పుడెప్పుడు అడుగుపెట్టాలా అని తహతహకాలాడుతున్నట్లు కనిపిస్తుంది. త్వరలోనే వీరు కూడా వారి రిలేషన్ ను అధికారికం చేయనున్నారు.


నిహారిక కొణిదెల

మెగా డాటర్ గా నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోగా ట్రోల్స్ కు గురైంది. ఆ తరువాత పలు సినిమాల్లో అమ్మడు కనిపించినా సేమ్ సీన్ రీపీట్. దీంతో మెగా ఫ్యామిలీ ఒక మంచి సంబంధం అని చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ జంట అయినా కలకాలం కలిసి ఉంటారనుకుంటే .. మూడేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల తరువాత నటిగా, నిర్మాతగా మారి కెరీర్ మీద ఫోకస్ పెట్టిన నిహారిక త్వరలోనే రెండో పెళ్లికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఈమధ్యనే నాగబాబు ఆ విషయాన్నీ కన్ఫర్మ్ కూడా చేశాడు. తమ తొందరపాటు వలనే నిహారిక పెళ్లి జరిగిందని, ఆమెకు నచ్చలేదు వచ్చేసింది.. త్వరలో తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.


ఇక వీరు మాత్రమే కాదు.. రెండో పెళ్లి కోసం ఊవిళ్లూరుతున్నవారు బాలీవుడ్ లో కూడా చాలా ఉన్నారు. మలైకా అరోరా.. అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడిపి పెళ్లివరకు వెళ్ళాలి అనుకుంది. కానీ, అది కుదరలేదు. ప్రస్తుతానికి సింగిల్ గా ఉన్నా కచ్చితంగా మింగిల్ అవుతాను అని చెప్పుకొచ్చింది. ఇక విడాకులు తీసుకొని సింగిల్ గా ఉన్న ఊర్మిళ, చిత్రంగదా, పలు సీరియల్ హీరోయిన్స్ కొత్త జీవితం కోసం వెంపర్లాడుతున్నవారే. మరి వీరి జీవితాల్లో కొత్త వెలుగు ఎప్పుడొస్తుందో చూడాలి.

Vijay Devarakonda: హాస్పిటల్ లో విజయ్ దేవరకొండ.. ఆందోళనలో ఫ్యాన్స్

Sir Madam Trailer: హమ్మయ్య.. డబ్బింగ్ మార్చరురా బాబు.. ట్రైలర్ ఇప్పుడు అదిరిపోయింది

Updated Date - Jul 17 , 2025 | 08:16 PM