Vijay Devarakonda: హాస్పిటల్ లో విజయ్ దేవరకొండ.. ఆందోళనలో ఫ్యాన్స్
ABN , Publish Date - Jul 17 , 2025 | 06:55 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హాస్పిటల్ పాలయ్యాడని వార్తలు వస్తున్నాయి. సడెన్ గా వాతావరణం మారడంతో విజయ్ కు జ్వరం వచ్చిందని, వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారట కుటుంబ సభ్యులు.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హాస్పిటల్ పాలయ్యాడని వార్తలు వస్తున్నాయి. సడెన్ గా వాతావరణం మారడంతో విజయ్ కు జ్వరం వచ్చిందని, వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారట కుటుంబ సభ్యులు. జ్వరం తగ్గకపోవడంతో టెస్టులు చేయగా విజయ్ దేవరకొండకు డెంగ్యూ అని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బెంగుళూరులోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం జూలై 20 వరకు హాస్పిటల్ లోనే ఉండనున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు విజయ్ టీమ్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించలేదు. ఇంకోపక్క అభిమానులు విజయ్ కు ఏమైంది అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంకో 10 రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా విజయ్ కు ఈ సమయంలోనే ఇలా అవ్వడం ఫ్యాన్స్ ను మరింత కృంగదీస్తుంది. లైగర్ లాంటి ప్లాప్ తరువాత నుంచి ఇప్పటివరకు విజయ్ ఒక్క విజయాన్ని అందుకున్నది లేదు. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ కింగ్డమ్ మీదనే పెట్టుకున్నాడు.
జెర్సీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్,టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న విజయ్ ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే విజయ్ హాస్పిటల్ లో ఉండడం వలనే ప్రమోషన్స్ ఇంకా షురూ చేయలేదని అంటున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు విజయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Sir Madam Trailer: హమ్మయ్య.. డబ్బింగ్ మార్చరురా బాబు.. ట్రైలర్ ఇప్పుడు అదిరిపోయింది
Fahadh Faasil: కీ ప్యాడ్ ఫోన్ రూ. 10 లక్షలు.. ఎందుకంత స్పెషలో తెలుసా