Bandla Ganesh: బండ్ల టార్గెట్ చేసిన హీరో అతనేనా.. కారణం ఏంటి!?

ABN , Publish Date - Nov 04 , 2025 | 02:18 PM

కె ర్యాంప్(K Ramp) సక్సెస్ మీట్ లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మొదటి నుంచి కూడా బండ్లన్న స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

Bandla Ganesh

Bandla Ganesh: ఇక ఇప్పుడు కె ర్యాంప్ సక్సెస్ మీట్ కూడా మరో వివాదానికి కారణమైంది. ఇండస్ట్రీ గురించి.. అందులో జరిగే లొసుగులు గురించి మాట్లాడడం ఓకె కానీ, హీరోలను కావాలని టార్గెట్ చేసి మాట్లాడటం తప్పు అని కొంత మంది నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ ఈవెంట్ లో బండ్ల ఏమన్నాడు..? అంటే… ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ కొట్టగానే… వాట్స్ అప్. . వాట్స్ అప్ అంటూ మాట్లాడి అర్ధరాత్రి కళ్లద్దాలు పెట్టుకునికాలు మీద కాలు వేసుకొనే ఈరోజుల్లో హిట్స్ మీద హిట్స్ కొడుతూ కూడా మన ఇంట్లో కుర్రాడిలా ఉన్నాడు కిరణ్ అబ్బవరం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు... చిరిగిన ప్యాంట్ వేసుకొని, నిక్కర్ వేసుకొని వాట్స్ అప్.. వాట్స్ అప్ అంటే కుదరదు. వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఒక్క హిట్ పడగానే... ఆ టాప్ డైరెక్టర్ కావాలి... ఈ టాప్ టెక్నీషియన్ కావాలి అని అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. సడెన్ గా బండ్లన్న ఇలా మాట్లాడాడు ఏంటి.. అసలు ఆయన టార్గెట్ చేసిన ఆ హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

చిరిగిన ప్యాంట్ వేసుకొని, నిక్కర్ వేసుకొని వాట్స్ అప్.. వాట్స్ అప్ అనేది విజయ్ నే అని, విజయ్ నే బండ్ల టార్గెట్ చేశారని చెప్పుకొస్తున్నారు. అసలు వీరిద్దరికీ ఎక్కడ చెడింది. విజయ్ తండ్రి తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిన బండ్ల.. సడెన్ గా ఇలా మాట్లాడడం వెనుక కారణం ఏంటి.. అంటే దానికి పలు కారణాలు చెప్పుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా మళ్ళీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఫుల్ బిజీ అవ్వాలని చూస్తున్న బండ్ల సినిమా ఆఫర్ ను వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విజయ్ కాదన్నాడని ఓ టాక్.

ఇక తన రీ ఎంట్రీ కోసమే ఆమధ్య బండ్లన్న కోట్లు ఖర్చు పెట్టి మరీ భారీ స్థాయిలో దీవాళీ పార్టీ ఇచ్చాడు. హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్స్ ను పిలిచి మరీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అందులో భాగంగానే విజయ్ తో సినిమా అనుకున్నా వర్కవుట్ కాకపోవడంతోనే ఇలా టార్గెట్ చేశాడు అనేది కొందిరి మాట.

అలాగే లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో బండ్ల… ఆ సినిమా హీరో మౌళికి కొన్నిఉచిత సలహాలు ఇచ్చి వెళ్ళాడు. అదే ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ... ఆ తర్వాత మాట్లాడుతూ ‘ఎవడి మాట వినాల్సిన అవసరం లేదు.. నువ్వు నీలా ఉండు’ అని చెప్పుకొచ్చాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా బండ్ల గణేష్ చెప్పిన దానిని ఖండించినట్లే అని, అందుకే దానికి కౌంటర్ గా బండ్ల ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు. అసలు బండ్ల గణేశ్ – విజయ్ దేవరకొండ మధ్య క్లాష్ కు రీజన్ ఏంటి అనేది తెలియాలంటే వారిద్దిరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. మరి అది ఎప్పుడు జరుగుతుందో!? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Bandla Ganesh: వాట్స్ అప్ అంటే రాదు సక్సెస్.. కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో రెచ్చిపోయిన బండ్లన్న..

Tollywood: నిజ సంఘటనల ఆధారంగా 'కాళీమాతా

Updated Date - Nov 04 , 2025 | 03:33 PM