Bandla Ganesh: వాట్స్ అప్ అంటే రాదు సక్సెస్.. కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో రెచ్చిపోయిన బండ్లన్న..
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:35 PM
స్పీచ్ లు ఇవ్వాలంటే ఇండస్ట్రీలో బండ్ల గణేష్ (Bandla Ganesh) తరువాతనే ఎవరైనా.. మైక్ పట్టుకుంటే బండ్లన్నకు పూనకం వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు
Bandla Ganesh: స్పీచ్ లు ఇవ్వాలంటే ఇండస్ట్రీలో బండ్ల గణేష్ (Bandla Ganesh) తరువాతనే ఎవరైనా.. మైక్ పట్టుకుంటే బండ్లన్నకు పూనకం వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొన్నటికి మొన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా అల్లు అరవింద్ నే విమర్శించాడు. అది ఎంత వివాదంగా మారిందో అందరికీ తెల్సిందే. ఇక ఇప్పుడు మరోసారి బండ్ల గణేష్ రెచ్చిపోయాడు.
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కె ర్యాంప్. రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కిరణ్ వన్ మ్యాన్ షో.. ఫుల్ కామెడీతో ప్రేక్షకులను అలరించడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ కూడా రాబట్టింది. ఇక దీంతో మేకర్స్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ కు బండ్లన్న చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.
ఈ సక్సెస్ మీట్ లో కూడా ఏ ఒక్కరిని వదలలేదు. రావడం రావడమే.. రాజేష్ దండా.. ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన వార్నింగ్ మీద సెటైర్లు వేశాడు. ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్క్ అవుట్ అవ్వవు.. రాజకీయాలు వర్క్ అవుట్ అవుతాయి. మంచి మంచి విజయాలను రాజేష్ ఇంకా అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ మొదలెట్టాడు.
కిరణ్ అబ్బవరం అనే ఒక నిజాయితీగల కుర్రాడు.. ఒక చిన్న కుటుంబంలో పుట్టి, కష్టపడి, కలలు కని, సినిమా ఇండస్ట్రీకి వెళ్లి హీరో కావాలనే సంకల్పంతో హీరో అయ్యాడు. యూత్ అందరికీ చెప్తున్నా.. మీకు ఏది అవ్వాలనిపిస్తే అది అవ్వండి.. మీ మనసుకు నచ్చింది చేయండి. హీరో కావాలంటే హీరో కండి. కళామ్మతల్లి గొప్ప తల్లి. నిజాయితీగా ఉంటే ఎవరినైనా సక్సెస్ చేస్తుంది. అమ్మను నిజాయితీగా నమ్ముకున్నవాడు ఎవడు చెడిపోలేదు.
ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్స్ అప్. . వాట్స్ అప్ అంటూ మాట్లాడి అర్ధరాత్రి కళ్లద్దాలు పెట్టుకొనికాలు మీద కాలు వేసుకొనే ఈరోజుల్లో హిట్స్ మీద హిట్స్ కొడుతూ కూడా మన ఇంట్లో కుర్రాడిలా ఉన్నాడు . ప్రతి ఇంట్లో కిరణ్ లాంటి కొడుకు ఉండాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కిరణ్ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యాడు. కిరణ్ ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారతరత్న అందుకోబోతున్న ఆయన ఇంకా గ్రౌండ్ మీదనే ఉండాలి అంటారు. నీలాంటివాళ్లు ఇన్సఫిరేషన్ గా తీసుకోవాలి ఆయనను.
కిరణ్ అబ్బవరం నీకు తిరుగు లేదు. నువ్వు ఇలాగే ఉండు. నీ స్టైల్, యాక్టింగ్ అంతా స్క్రీన్ మీద.. బయట ఎప్పుడు ఇలానే ఉండాలి. చిరిగినా ప్యాంట్ వేసుకొని, నిక్కర్ వేసుకొని వాట్స్ అప్.. వాట్స్ అప్ అంటే కుదరదు. వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇక కిరణ్ గ్రేట్ నెస్.. అతడు చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టరే. ఒక్క సినిమా హిట్ కొడితే ఆ స్టార్ డైరెక్టర్ ని తీసుకురా.. ఈ స్టార్ డైరెక్టర్ ను తీసుకురా అనే ఈరోజుల్లో మట్టిలో మాణిక్యాలుగా కొత్త డైరెక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. నేర్చుకోండి కిరణ్ ని చూసి.. కొత్తవారికి అవకాశం ఇవ్వండి. కొత్తవాళ్లని మీకు ఛాన్స్ ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్లా.. గతాన్ని మర్చిపోకండి. ఏడాదికి ఒక కొత్త డైరెక్టర్ ను పరిచయం చేయండి.
ఆరుగురు కొత్త డైరెక్టర్లను పరిచయం చేసిన హీరో కిరణ్ అబ్బవరం దమ్మునోడు.. ఖలేజా ఉన్నోడు.. గ్రేట్. ఆస్తిని వారసత్వంగా ఇవ్వొచ్చు కానీ, తెలివిని వారసత్వంగా ఇవ్వలేరు. సక్సెస్ ను వారసత్వంగా ఇవ్వలేడు. వెయ్యి కోట్లు ఇస్తా ఒక గబ్బర్ సింగ్ ఇవ్వగలరా.. దమ్ము, దైర్యం, దేవుడి దయ, సినిమాపై ప్రేమ ఇవన్నీ ఉంటేనే హిట్ ఇంటికొస్తుంది.. వాట్స్ అప్ అంటే రాదు హిట్. కిరణ్ అబ్బవరం భవిష్యత్తు కె ర్యాంప్ అంటూ ముగించాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్ డైరెక్ట్ గా బండ్లన్న.. విజయ్ దేవరకొండ గురించే మాట్లాడినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.