Sambarala Yeti Gattu: తేజ్ కొత్త సినిమా.. చెక్ పెట్టిన టీమ్

ABN , Publish Date - Oct 31 , 2025 | 06:21 PM

విరూపాక్ష వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బస్టర్ సాధించిన త‌ర్వాత మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) నటిస్తున్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటి గట్టు(Sambarala Yeti Gattu).

Sai Durga Tej

Sambarala Yeti Gattu: విరూపాక్ష వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బస్టర్ సాధించిన త‌ర్వాత మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) నటిస్తున్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటి గట్టు(Sambarala Yeti Gattu). ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రోహిత్ కె.పి ద‌ర్శ‌క‌త్వంలో కె.నిరంజ‌న్ రెడ్డి, చైత‌న్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన ఇంట్రూడ్ ఇన్ టు ది వ‌ర‌ల్డ్ ఆఫ్ ఆర్కెడి, సంబ‌రాల ఏటి గ‌ట్టు క్రార్నేజ్ వీడియోస్‌లో స్టన్నింగ్ విజువ‌ల్స్, ఇంటెన్స్ అభిమానుల్లో సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. దీన్ని మ‌రింత పెంచుతూ సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అసుర ఆగ‌మ‌న గ్లింప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అందుతున్న స‌మాచారం ప్రకారం చిత్రీక‌ర‌ణ‌లో మేజ‌ర్ పార్ట్ పూర్తైంది. ఇంకో రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉంది. వ‌చ్చేఏడాది ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ నేపధ్యంలోనే సంబరాల ఏటిగట్టు సినిమాకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో మరోసారి వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని, తేజ్ ఈ సినిమా కాకుండా కొత్త సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి. తేజ్ ప్రస్తుతం రిపబ్లిక్ 2 సినిమాతో బిజీగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలను తేజ్ సన్నిహితులు ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అసత్యమని, ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా సంబ‌రాల ఏటి గ‌ట్టు సినిమా మీద‌నే ఉంద‌ని.. ఆయ‌న కొత్త సినిమా చేయ‌టానికి అంగీకరించ‌లేద‌ని టీమ్ స్పష్టం చేసింది. ఈ సినిమాకు, సాయి దుర్గ తేజ్‌కు సంబంధించిన రూమ‌ర్స్‌ను నమ్మవద్దని స‌న్నిహిత వ‌ర్గాలంటున్నాయి. అధికారికంగా ఆయ‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను పి.ఆర్ టీమ్ వెల్లడిస్తుందని తెలిపింది. దీంతో ఈ వార్తలకు చెక్ పడింది. మరి తేజ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Prashanth Neel: బాహుబలి ది ఎపిక్ రివ్యూ.. ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరు

Nandamuri Balakrishna: నంద‌మూరి వార‌సుడు వెన‌క‌డుగు.. కూతురు ముందడుగు!

Updated Date - Oct 31 , 2025 | 06:21 PM