Prashanth Neel: బాహుబలి ది ఎపిక్ రివ్యూ.. ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరు
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:38 PM
ఎట్టకేలకు బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) థియేటర్ లోకి వచ్చేసింది. ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత హంగామా ఉంటుందో.. ఈ సినిమాకు కూడా అంతే ఉంది.
Prashanth Neel: ఎట్టకేలకు బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) థియేటర్ లోకి వచ్చేసింది. ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత హంగామా ఉంటుందో.. ఈ సినిమాకు కూడా అంతే ఉంది. రీ రిలీజ్ కాకుండా రెండు భాగాలను కలిపి ది ఎపిక్ గా రిలీజ్ చేసి రాజమౌళి (Rajamouli)సక్సెస్ అయ్యాడు. నేడు బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. ప్రభాస్, రానా, అనుష్క లను మరోసారి ఆ పాత్రల్లో చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
అభిమానులు మాత్రం కాకుండా సెలబ్రిటీలు కూడా బాహుబలి ది ఎపిక్ చూసి మరోసారి రాజమౌళి గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియాను ఒక రోడ్డుగా వర్ణించాడు. ' ఒక రోడ్డుకు మరమత్తులు చేయాల్సి వచ్చింది. అందరూ కలిసి ఒక కాంట్రాక్టర్ ను పిలిచారు. ఆ కాంట్రాక్టర్ రోడ్డును మరమత్తు చేయడమే కాకుండా.. 16 లైన్స్ కలిసేలా హైవేనే క్రియేట్ చేశాడు. ఆ రోడ్డు పాన్ ఇండియా.. ఆ కాంట్రాక్టర్ రాజమౌళి.. బాహుబలి చిత్ర బృందానికి మొత్తం శుభాకాంక్షలు ' అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా ప్రశాంత్ నీల్ చెప్పినట్లు పాన్ ఇండియాకు మార్గం వేసింది మాత్రం జక్కన్ననే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు జక్కన్న గొప్పతనం గురించి ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Nandamuri Balakrishna: కొడుకు వెనకడుగు... కూతురు ముందడుగు!
Women’s Cricket Team: మహిళా క్రికెట్ జట్టుకు సెలబ్రిటీల అభినందనలు