Swayambhu: ఎట్టకేలకు ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. చాలు సామీ
ABN, Publish Date - Sep 18 , 2025 | 08:47 PM
కార్తికేయ 2 తరువాత నిఖిల్ (Nikhil) పాన్ ఇండియా గుర్తింపును అందుకున్నాడు. ఆ సినిమా తరువాత నుంచి జోష్ పెంచిన నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా మారాడు.
Swayambhu: కార్తికేయ 2 తరువాత నిఖిల్ (Nikhil) పాన్ ఇండియా గుర్తింపును అందుకున్నాడు. ఆ సినిమా తరువాత నుంచి జోష్ పెంచిన నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. అయితే స్పై సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో నిఖిల్ ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగానే నిఖిల్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి ది ఇండియన్ హౌస్ (The Indian House) కాగా.. రెండు స్వయంభు (Swayambhu).
ఈ మధ్యనే ది ఇండియన్ హౌస్ సెట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో కొన్నిరోజులు ఆ సినిమా షూటింగ్ ను వాయిదా వేసిన విషయం విదితమే. ఇక దీని కన్నా ముందు మొదలుపెట్టిన స్వయంభు సినిమా ఏమైందో అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న స్వయంభు సినిమాను భువన్ సాగర్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
గత కొన్ని నెలలుగా స్వయంభు నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు అసలు ఈ సినిమా ఉందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ తాజాగా మేకర్స్ స్వయంభు నుంచి పెద్ద అప్డేట్ ను అందించారు. స్వయంభు ఫైనల్ షెడ్యూల్ నేటి నుంచి మొదలు కానున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ను చీరాలలో జరగనున్నట్లు తెలిపారు. ఇక చీరాలకు వెళ్లిన నిఖిల్ కు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పూలదండలు వేసి ఆహ్వానించారు. త్వరలోనే స్వయంభు సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ అప్డేట్ ఇవ్వడంతో నిఖిల్ ఫ్యాన్స్ ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్లీ మొదలవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Venkatesh: చెప్పుతో ఆయన్ను కొట్టుకొని.. ఆ తరువాత నటుడిని కొట్టిన వెంకటేష్
Deepika Padukone: దీపికాను కల్కి నుంచి తొలగించడానికి కారణం ఇదే