Deepika Padukone: దీపికాను కల్కి నుంచి తొలగించడానికి కారణం ఇదే
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:37 PM
ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్న మంచిపేరును మొత్తం ఒక చిన్న తప్పు తుడిచేస్తుంది.
Deepika Padukone: ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్న మంచిపేరును మొత్తం ఒక చిన్న తప్పు తుడిచేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనె (Deepika Pdukone) పరిస్థితి అలానే మారింది. స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి దీపికా ఒక్కో మెట్టు ఎక్కుతూ చాలా కష్టపడింది,. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికీ బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది కూడా ఆమె.
అంత స్టార్ హీరోయిన్ ను ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం విమర్శిస్తోంది. దానికి కారణం ఆమె చేసిన చిన్న తప్పు. సాధారణంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని సెలబ్రిటీలను చూసే చెప్పుకొస్తారు. కానీ, కొంతమంది మాత్రం సెలబ్రిటీ హోదా రావడంతో కొద్దిగా గర్వం చూపిస్తారు. నేను లేకపోతే సినిమా ఆడదు. నేను ఉంటేనే సినిమాకు హైప్ అని.. వారి గొంతెమ్మ కోరికలన్నీ నిర్మాతలపై రుద్దుతారు. దీపికా కూడా అదే పని చేసింది. స్టార్ హీరోయిన్ కావడంతో తాను ఏం చెప్తే అది జరగాలని డిమాండ్ చేయడం అమ్మడి కొంప ముంచింది.
కల్కి 2898 AD సినిమాతో దీపికా తెలుగుతెరకు పరిచయమైంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి పరాజయాలను చవిచూసి వెనక్కి వెళ్లిపోయే హీరోయిన్స్ లా కాకుండా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. నిజం చెప్పాలంటే కల్కి మొదటి పార్ట్ లో దీపికా నటనకు అంత ప్రాముఖ్యత లేకపోయినా ఉన్నంత వరకు ఓకే అనిపించింది. అయితే అమ్మడి నటన చూడాలి అంటే సెకండ్ పార్ట్ లోనే అని మేకర్స్ కూడా చెప్పడంతో ఎప్పుడెప్పుడు కల్కి సీక్వెల్ మొదలుపెడతారా అని ఎదురుచూసారు.
ఇక కల్కి సీక్వెల్ లో కూడా దీపికానే ఉంటుందని మొదట మేకర్స్ ప్రకటించారు కూడా. ఆ సమయంలోనే దీపికా తన గర్వం చూపించింది. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే అక్కడ తన డిమాండ్స్ చెప్పి సందీప్ రెడ్డి వంగాకే చెమటలు పట్టించింది. కళ్ళు చెదిరే పారితోషికం, కేవలం రోజులో 7 గంటలు మాత్రమే షూటింగ్.. లగ్జరీ ట్రీట్ మెంట్.. ఇలా ఒకటని చెప్పలేం. అవన్నీ చూసి సందీప్.. నెమ్మదిగా దీపికాను సైడ్ చేసి త్రిప్తి డిమ్రిని దింపాడు. దాంతో నన్ను తీసి తనను పెడతాడా అని కక్ష కట్టిన దీపికా స్పిరిట్ కథను పీఆర్ ల చేత లీక్ చేయించి, నెగిటివ్ చేయించింది.
దీపికా పద్ధతి నచ్చని వంగా ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎవరికి ఏది చెప్పుకుంటావో చెప్పుకో పో అని వదిలేశాడు. ఒకసారి ఇంత జరిగినా దీపికాలో ఎలాంటి మార్పు రాలేదు. కల్కి సీక్వెల్ కూడా దీపికా ఇవే గొంతెమ్మ కోరికలు అడిగినట్లు తెలుస్తోంది. కల్కి పార్ట్ 1 కి ఇచ్చిన రెమ్యూనరేషన్ పై 25 శాతం ఎక్కువ ఇవ్వాలని, మొదట చెప్పిన విధంగానే 7 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పుకొచ్చిందట. అంతేకాకుండా తనతో పాటు తన 25 మంది టీమ్ కి లగ్జరీ వ్యానిటీ వ్యాన్స్ కావాలని, దాని ఖర్చు అంతా నిర్మాతలే భరించాలని చెప్పినట్లు సమాచారం.
కల్కి అనేది చిన్న సినిమా కాదు. విఎఫ్ఎక్స్ కే కోట్లలో ఖర్చు అవుతుంది. అలాంటి సినిమాకు హీరో ప్రభాస్ నే పారితోషికం పెంచమని అడగలేదు. కానీ, దీపికా మాత్రం 25 శాతం పెంచమని డిమాండ్ చేసిందట. అంతేనా వీటన్నింటికి ఏదో విధంగా మ్యానేజ్ చేద్దామని మేకర్స్ చాలా ప్రయత్నించారట. షూటింగ్ గంటలు పొడిగించి.. ఆమెకే ఎక్కువ రెస్ట్ ఇవ్వాలని కూడా అనుకున్నారట. కానీ, దానికి ఆమె ససేమిరా అని చెప్పిందని, కచ్చితంగా 7 గంటల తరువాత నిమిషం కూడా సెట్ లో ఉండనని ఖరాకండీగా చెప్పినట్లు తెలుస్తోంది.
దీపికాతో రెండు మూడుసార్లు వీటి గురించి చర్చించినా ఫలితం లేకపోయేసరికి .. ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చలేక వైజయంతీ మూవీస్ ఆమెను సినిమా నుంచి తొలగించిందని సమాచారం. ఏదిఏమైనా దీపికా చేసింది ముమ్మాటికీ తప్పే. స్పిరిట్ కానీ, కల్కి కానీ చిన్న సినిమాలు అయితే కావు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాలు హిట్ అయితే అమ్మడి పేరు మారుమ్రోగిపోయేవి. స్టార్ అనే హోదా ఉందని ఇలాంటివి చేయడం వలన అటు అవకాశాలు ఇటు ఆమెపై మిగతా సినిమా వాళ్లు పెట్టుకున్న నమ్మకాలు రెండు పోయాయి. దీని వలన దీపికా కెరీర్ ప్రశార్ధకంగా మారిన ఆశ్చర్యం లేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
K-Ramp: రచ్చకు రెడీగా ఉండండి...
Disha Patani: లెక్క సరిచేసిన యోగి ఆదిత్యనాథ్