సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The RajaSaab Pre Teaser: అంచనాలను పెంచేస్తున్న రాజాసాబ్  ప్రీ టీజర్ 

ABN, Publish Date - Jun 15 , 2025 | 03:23 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ది రాజాసాబ్( The RajaSaab)ఒకటి.  మారుతీ(Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు

The RajaSaab

The RajaSaab Pre Teaser:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ది రాజాసాబ్( The RajaSaab)ఒకటి.  మారుతీ(Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక  మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్,  స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 16 న రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఎప్పుడెప్పుడు రాజాసాబ్ టీజర్ రిలీజ్ అవుతుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

 

ఇక  టీజర్ వచ్చేలోపు.. మేకర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే  ప్రీ టీజర్ పేరుతో ఒక చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రీ టీజర్ లో అందరూ ఆకాశాన్ని చూస్తూ షాక్ కు గురి అయ్యినట్లు కనిపిస్తున్నారు. మాళవిక మోహనన, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ముగ్గురు పక్క పక్కన నిలబడిన షాట్ హైలైట్ గా మారింది. పై నుంచి  ఆత్మ కిందకు వస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఇక రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్న విషయం తెల్సిందే. తాతమనవడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు.  కామెడీ హర్రర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రభాస్ పోస్టర్స్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి. మొదటిసారి ప్రభాస్ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్దమవుతున్నాడు.  ఫ్యాన్స్ కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.

Kannappa Event: మోహన్‌లాల్‌.. మోహన్‌బాబు సరదా సంభాషణ


గత కొన్నేళ్లుగా ఈ బ్యానర్ కు ఒక్క విజయం కూడా దక్కింది లేదు.  రాజాసాబ్ కోసం విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ ను అందించాడు.  ఎంతో హైప్ ఉన్న ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంటేనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొద్దిగా తేరుకుంటుంది. ఇకపోతే  డిసెంబర్ 5 న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరి ఈ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jun 15 , 2025 | 03:24 PM