Kannappa Event: మోహన్‌లాల్.. మోహన్‌బాబు సరదా సంభాషణ
ABN , Publish Date - Jun 15 , 2025 | 02:07 PM
కేరళ, కొచ్చిలో జరిగిన కన్నప్ప ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మోహన్‌లాల్, మోహన్‌బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మంచు విష్ణు (Manchu Vishnu) కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (kannappa) . ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar singh) దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర బృందం కేరళ వెళ్లింది. కొచ్చిలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సినిమాలో కీలక పాత్ర పోషించిన మోహన్‌లాల్ ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ వేదికపై మోహన్‌లాల్, మోహన్‌బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇందులో మోహన్‌బాబు 'మీరు నటించే చిత్రంలో విలన్‌గా నటించాలనుందని’ మోహన్‌లాల్‌తో అన్నారు. దానికి మోహన్‌లాల్ సమాధానిమస్తూ 'ఇప్పటివరకూ నేను చూసిన స్వీట్ పర్సన్స్‌లో మోహన్‌బాబు కూడా ఒకరు. సుమారు 600 సినిమాలు చేశారు. మీరు హీరో.. నేను విలన్‌గా చేస్తా.. నాకు ఆ భాగ్యం కల్పించండి’ అని అన్నారు.
దానికి మోహన్‌బాబు 'అలా అనొద్దు. మీ సినిమాలో విలన్‌గానే చేయాలనుకుంటున్నా. దయచేసి అవకాశం ఇవ్వండి’ అన్నారు.
'విలన్‌గానే ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఆంటోనీ ఇది సాధ్యమవుతుందా? అని మోహన్‌లాల్ అనగానే వేదిక కింద ఉన్న ఆంటోనీ పెరంబవూరు ఓకే అన్నారు. మీరు విలన్‌గా చేస్తే.. మొదటి సీన్‌లోనే మిమ్మల్ని కాల్చి చంపేస్తా’ అని మోహన్‌లాల్ మోహన్‌బాబుతో ఉన్న మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.