Samantha: సమంత- రాజ్ రిలేషన్.. చైతన్య విడాకులు ఇవ్వడానికి కారణం అదే అంటున్న నెటిజన్స్
ABN, Publish Date - Nov 08 , 2025 | 04:45 PM
సోషల్ మీడియా వచ్చాకా ఏది దాగదు. ఎన్నేళ్ళు అయినా కూడా మర్చిపోయిన న్యూస్ ను కూడా తిరిగి ట్రెండింగ్ లోకి తీసుకురాగలరు నెటిజన్స్.
Samantha: సోషల్ మీడియా వచ్చాకా ఏది దాగదు. ఎన్నేళ్ళు అయినా కూడా మర్చిపోయిన న్యూస్ ను కూడా తిరిగి ట్రెండింగ్ లోకి తీసుకురాగలరు నెటిజన్స్. ప్రస్తుతం సమంత (Samantha)- నాగచైతన్య (Naga Chaitanya) విడాకుల న్యూస్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దానికి కారణం సమంత.. నిర్మాత రాజ్ నిడిమోరు (Raj Nidimoru) రిలేషన్. అక్కినేని నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కలకాలం కలిసి ఉంటారనుకున్న ఈ జంట నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేదు. మనస్పర్ధల కారణంగా వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విడాకులకు కారణాలు చాలా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అందులో ముఖ్యమైంది.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 లో సమంత నటించడమే అని చెప్పుకొచ్చారు. అక్కినేని ఇంటి పెద్ద కోడలు.. బోల్డ్ సన్నివేశాలు ఉన్న సిరీస్ లో చేయడం వలనే ట్రోల్స్ వచ్చాయని, దానివలన అక్కినేని ఇంట్లో గొడవలు వచ్చాయని, అవి పెరిగి పెరిగి విడాకులకు దారితీసాయని చెప్పుకొచ్చారు.
అయితే అది మాత్రమే కారణం కాదని,అన్నీ సామ్ మీదకు నెట్టివేయడం పద్దతి కాదని, చై కూడా తప్పు చేసి ఉండొచ్చు కదా అని అటు సామ్ అభిమానులు.. ఇటు చై అభిమానులు సోషల్ మీడియా కొట్టుకున్నారు. ఇక చై.. శోభితాను వివాహం చేసుకున్నప్పుడు.. చై - సమంత విడాకుల విషయంలో చైదే తప్పు అని.. పెళ్లి బంధంలో ఉన్నప్పుడే శోభితతో రిలేషన్ లో ఉన్నాడని, అందుకే ఆమె సమంత వదిలేసిందని మాట్లాడారు.
ఇక తాజాగా సమంత.. నిర్మాత రాజ్ తో తన బంధాన్ని అధికారికం చేసింది. నిన్న రాజ్ ను హాగ్ చేసుకున్న ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ ఫోటో చూశాక చై- సమంత విడాకుల గురించి మరోసారి రచ్చ మొదలైంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సమయం నుంచే రాజ్ తో సమంతకు రిలేషన్ ఉందని, ఆ విషయం తెలియడంతోనే అక్కినేని కుటుంబం సమంతను దూరం పెట్టారని.. వారి విడాకుల విషయంలో ఖచ్చితంగా సమంతదే తప్పు అని చెప్పుకొస్తున్నారు. సామ్ ని వదిలి చై .. శోభితను పెళ్లి చేసుకోవడం మంచిది అయ్యిందని కొందరు.. ఇంకొందరు వీరు కూడా రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా అభిమానులను రీల్ లోనూ.. రియల్ లోనూ అలరించిన జంట.. ఇలా కొత్త భాగస్వాములతో కనిపించడం కొద్దిగా బాధగా ఉన్నా కూడా వారు హ్యపీగా ఉంటే చాలు అని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Suma Kanakala: రాజీవ్ తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన సుమ
Ritesh Rana Movie: తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మిస్ యూనివర్స్ ఇండియా...