సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mysterious: సస్పెన్స్ జానర్ లో మరో సినిమా...

ABN, Publish Date - Jul 04 , 2025 | 04:18 PM

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మహి కోమటిరెడ్డి తెరకెక్కించారు.

అలనాటి నటుడు 'రక్త కన్నీరు' నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు.


రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'మిస్టీరియస్' మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేసింది మూవీ టీమ్. ఈ సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ 'సస్పెన్స్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సినిమా సక్సెస్ పై మరింత నమ్మకం పెరిగింది' అని అన్నారు. నిర్మాతలు ఉషా, శివానీ మాట్లాడుతూ, 'సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాం' అని చెప్పారు. హీరోలుగా నటించిన అబిద్ భూషణ్, రోహిత్ సహాని తమకు మంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కి ధ్యాంక్స్ చెప్పారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని సందడి చేశారు.

Aslo Read: Thammudu: తమ్ముడు సినిమా రివ్యూ

Updated Date - Jul 04 , 2025 | 04:18 PM