Ghantasala Biopic: ఘంటసాల బయోపిక్.. డిసెంబర్ 5న ప్రీ రిలీజ్
ABN, Publish Date - Dec 03 , 2025 | 04:32 PM
ఘంటసాల వెంకటేశ్వరరావు అమర గానాన్ని, అసమాన్య జీవితాన్ని గుర్తు చేసేలా సిహెచ్ రామారావు ఘంటసాల బయోపిక్ ను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రివ్యూలకు విశేష స్పందన లభించిందని ఆయన తెలిపారు.
తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు ఘంటసాల (Ghantasala). ఆయన తన గాత్రంతోనే కాకుండా విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఆ అమరగాయకుడు ఘంటసాల బయోపిక్ ను సిహెచ్. రామారావు (CH Ramarao) తెరకెక్కించారు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన జీవితంలోని విభిన్న ఘట్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి కేవలం ప్రివ్యూ షోలతోనే ప్రేక్షకుల చేత ఔరా అనిపించారు. ఈ జీవిత చరిత్రాత్మక చిత్రం ఆదిలోనే ఘనమైన స్పందనను పొందుతోంది.
ఘంటసాల వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ప్రీవ్యూ షోలు నిర్వహించగా... అక్కడి భారతీయులు ఈ చిత్రాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని సిహెచ్ రామారావు తెలిపారు. ఘంటసాల గాత్రం, గౌరవం, మహిమను మరోసారి అనుభవించే అవకాశం ఈ సినిమా కల్పించిందని అక్కడి వారు చెప్పారని ఆయన అన్నారు. 'లెజెండ్ ఘంటసాల' బయోపిక్ ఇంత గ్రాండ్ గా, ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా చేసినందుకు వారంత దర్శకుడు రామారావును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం, వరల్డ్ వైడ్ ఆడియన్స్ కోసం డిసెంబర్ 12న విడుదల చేయడానికి సిద్ధం చేశారు మేకర్స్. అదేవిధంగా విడుదలకు ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఘంటసాల అమరగానాన్ని, ఆయన అసమాన్య జీవితాన్ని మరోసారి గుర్తు చేసేలా రూపొందించిన ఈ సినిమా కోట్లాది మంది ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుందని బలంగా నమ్ముతున్నారు మేకర్స్.
కృష్ణ చైతన్య, మృదుల, సుమన్, 'తులసి' ఫేమ్ అతులిత, సుబ్బరాయు శర్మ, జే.కె. భారవి, సుమన్ శెట్టి, అనంత్, సాయి కిరణ్, అశోక్ కుమార్, గుండు సుదర్శన్, జయవాణీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాలూరి వాసురావు (Vasurao) సంగీతం అందించారు. ఈ సినిమాను సిహెచ్ ఫణి నిర్మించారు.
Also Read: Sankranthi: 'బైకర్' బరి నుండి తప్పుకున్నా... 'నారీ నారీ నడుమ మురారి' రావడం ఖాయమట...
Also Read: Ravi Mohan: నిన్న రాజ్.. నేడు రవి.. పెళ్లి కాకుండానే వారితో