సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chadalavada: వాడు మంచి దొంగ‌.. ముందు ఇంటి దొంగ‌ల‌ను ప‌ట్టుకోవాలి

ABN, Publish Date - Nov 18 , 2025 | 08:36 PM

సినిమా పైర‌సీ, ఇటీవ‌లీ ఐబొమ్మ ర‌వి కేసు విష‌యంలో మంగ‌ళ‌వారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Chadalavada

సినిమా పైర‌సీ, ఇటీవ‌లీ ఐబొమ్మ ర‌వి కేసు విష‌యంలో మంగ‌ళ‌వారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ( Telugu Film Chamber of Commerce Press Meet) ప్రెస్ మీట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు (chadalavada srinivas rao) మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న పైరసీ మరియు ఇటీవల పెరిగిన అధిక టికెట్ ధరల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ అని వారికి ఎప్ప‌టికీ కృత‌జ్ఙ‌త‌తో ఉంటామ‌ని అన్నారు.ఈ రెండు అంశాలు ముఖ్యంగా చిన్న చిత్రాల మనుగడకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పుష్ప సినిమా రిలీజ్‌కి వారం రోజుల ముందే డౌన్లోడ్ చేశార‌ని వాడు మంచి దొంగ కాబ‌ట్టి వెంట‌నే అప్‌లోడ్ చేయ‌లేద‌ని అన్నారు. కానీ సినిమా పైరసీ అనేది కేవలం థియేటర్ల నుండే కాకుండా, క్యూబ్ (Qube), వీఎఫ్ఎస్ (VFS) వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచే బయటకు వెళ్తోందని.. ఈ సంస్థల ద్వారా కంటెంట్ థియేటర్లకు చేరే క్రమంలోనే లీక్‌లు జరుగుతున్నాయని, దీనిపై నిర్మాతలు తప్పకుండా నిఘా పెట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

అంతేగాక‌.. సినిమా టికెట్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం అధిక నిర్మాణ వ్యయమేనని, అయితే దీని వెనుక ముఖ్యంగా కొందరి అధిక రెమ్యునరేషన్ సైతం ఉందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తీసామని టికెట్ రేటు పెంచితే ఎలా? టికెట్ రేటు ఎక్కువ వుండడం వల్ల ప్రేక్షకుడు దొంగ దారిలో సినిమా చూస్తున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాల్లో ఒకరిద్దరికి మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం వల్ల బడ్జెట్ పెరుగుతుందని, దాని ప్రభావం చివరికి టికెట్ ధర రూపంలో ప్రేక్షకులపై పడుతోందని ఆయన స్పష్టం చేశారు. సినిమా నిర్మాణంలో క్వాలిటీ (నాణ్యత) కు ప్రాధాన్యత ఇవ్వాలే కానీ, అనవసరంగా బడ్జెట్‌ను పెంచడం సరికాదని శ్రీనివాసరావు ఉద్ఘాటించారు.

కేవలం కొందరి స్టార్ల కోసం బడ్జెట్‌ను పెంచి, టికెట్ ధరలు పెంచడం వల్ల పరిశ్రమకు హాని కలుగుతుందని హెచ్చరించారు. పెద్ద బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి 10 లోపు వస్తున్నప్పటికీ, వాటి ప్రభావం వల్ల చిన్న సినిమాలు తీవ్రంగా నష్ట పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాల సందడిలో చిన్న చిత్రాలకు తగినన్ని థియేటర్లు లభించకపోవడం, ప్రేక్షకుడి దృష్టి వాటిపైకి మరలకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన తెలిపారు. ముగింపులో, పైరసీని మూలాలనుంచి అరికట్టడం, టికెట్ ధరలను నియంత్రించడం ద్వారానే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆరోగ్యంగా మనుగడ సాగించగలుగుతుందని, ముఖ్యంగా చిన్న చిత్రాలకు మద్దతు లభిస్తుందని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 18 , 2025 | 09:10 PM