సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Power Star: పవన్ కళ్యాణ్‌ ఓజీకి తెలంగాణలో ఎదురుదెబ్బ...

ABN, Publish Date - Sep 24 , 2025 | 03:45 PM

తెలంగాణ ప్రభుత్వం ఓజీ టిక్కెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్ట్ సస్పెండ్ చేసింది.

OG Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'ఓజీ' మూవీ ప్రీమియర్ షోస్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా బెనిఫిట్ షోస్ తో పాటు టిక్కెట్ రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మోమోను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. దాంతో ఈ రాత్రికి తెలంగాణ వ్యాప్తంగా బెనిఫిట్ షోస్ పడతాయా? లేదా? అనే సందేహం నెలకొంది. అలానే టిక్కెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియక అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ కావడంతో చాలామంది టిక్కెట్లను కొనుగోలు చేశారు. వారు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు.


హోంశాఖ మెమోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహేష్ యాదవ్. టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్ కు ఎలాంటి అధికారాలు లేవన్నా పిటిషన్ తరపు న్యాయవాది. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్ కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందన్న పిటిషన్ తరపు న్యాయవాది. టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయన్న పిటిషన్ న్యాయవాదితో ఏకీభవించిన హైకోర్ట్ జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌ కుమార్ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన మోమోను సస్పెండ్ చేసి, కేసు తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు.

Also Read: Bandla Ganesh: కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్లన్న అన్నది ఎవరిని.. ?

Also Read: Vishal : 'మకుటం' సెట్స్ కు శింబు తండ్రి రాజేందర్

Updated Date - Sep 24 , 2025 | 03:52 PM