TejaSajjaPMF2: మొదటిదే రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే రెండో సినిమానా
ABN, Publish Date - Aug 23 , 2025 | 08:16 PM
కుర్ర హీరో తేజ సజ్జా (Teja Sajja) వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. హనుమాన్ (Hanuman) తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ.. ఆ తరువాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో మిరాయ్ (Mirai) సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.
TejaSajjaPMF2: కుర్ర హీరో తేజ సజ్జా (Teja Sajja) వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. హనుమాన్ (Hanuman) తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ.. ఆ తరువాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో మిరాయ్ (Mirai) సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. సూపర్ యోధ కథతో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మొదట మిరాయ్ ఆగస్టులో రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన సెప్టెంబర్ 5 కి వాయిదా పడింది. అయితే.. ఇంకా విఎఫ్ఎక్స్ అవ్వలేదని ఈసారి కూడా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నేడు తేజ పుట్టినరోజున విష్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో రిలీజ్ డేట్ వేయలేదు. దీంతో మిరాయ్ కచ్చితంగా వాయిదా పడిందని కన్ఫర్మ్ అయ్యింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం వాయిదా పడిన ఈ సినిమా సెప్టెంబర్ 12 న కానీ లేక 19 న కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
ఇప్పటివరకు మిరాయ్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇవ్వని పీపుల్ మీడియా సడెన్ గా తేజ సజ్జాతో రెండో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చింది. తేజ సజ్జాతో కొత్త సినిమాను ప్రకటించి తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ' గతంలో లేనంత బలంగా.. ఎప్పుడు లేనంత క్రూరంగా' అనే ట్యాగ్ లైన్ తో తేజ సజ్జాతో రెండోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమా 2027 సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపింది. పోస్టర్ లో రాయలసీమ నుంచి ప్రపంచం అంతం అయ్యేవరకు అంటూ ఒక చేతిని చూపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచింది. మరి మిరాయ్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది.. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనేది చూడాలి.
Sunday Tv Movies: ఆదివారం, ఆగస్టు 24.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
NTR: ప్రశ్నల సుడిగుండంలో ఎన్టీఆర్..