సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mirai Movie: అనుకున్న డేట్ కే మిరాయ్.. పోటీ తప్పదా

ABN, Publish Date - Aug 27 , 2025 | 03:43 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ అవ్వడం అరుదుగా జరుగుతుంది. మొదట ఒక రిలీజ్ డేట్ ప్రకటించాలి.

Mirai

Mirai Movie: ప్రస్తుతం టాలీవుడ్ లో అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ అవ్వడం అరుదుగా జరుగుతుంది. మొదట ఒక రిలీజ్ డేట్ ప్రకటించాలి. ఆ సమయానికి ఏదో ఒక కారణంతో వాయిదా వేయాలి. మళ్లీ కొన్నిరోజులు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించి అప్పుడు రిలీజ్ చేయాలి. ఇదే ట్రెండ్ గా నడుస్తోంది. గత కొన్ని నెలలుగా ఏ సినిమా కూడా వాయిదా పడకుండా వచ్చింది లేదు. ఇక ఇప్పుడు రాబోయే సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది.


హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఆగస్టులో రిలీజ్ ఉంటుంది అని ప్రకటించారు. అది కాస్తా సెప్టెంబర్ 5 కి వాయిదా పడింది. సరే ఆ డేట్ కైనా వస్తుంది అనుకుంటే.. కార్మికుల సమ్మె దానికి అడ్డుగా నిలబడింది. దీంతో చేసేది లేక ఇంకోసారి వాయిదా వేసి చివరకు సెప్టెంబర్ 12 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు.


వినాయక చవితి పండగను పురస్కరించుకోని మిరాయ్ ట్రైలర్ అప్డేట్ ని, దాంతోపాటు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆగస్టు 28 న మధ్యాహ్నం 12 గంటలకు మిరాయ్ ట్రైలర్ రిలీజ్ కానుందని, సెప్టెంబర్ 12 న సినిమా రిలీజ్ కు రెడీ కానున్నట్లు తెలిపారు. అయితే అదేరోజు బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కాంత కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మిరాయ్ సెప్టెంబర్ 12 న కాకుండా 19 న వస్తుంది అని అనుకున్నారు. దీంతో బెల్లంకొండ కానీ, కాంత కానీ ఏది వెనక్కి తగ్గే అవసరం లేదు అనుకున్నారు. కానీ, మిరాయ్ వారం ముందే వస్తున్నట్లు కన్ఫర్మ్ చేయడంతో మూడు సినిమాల మధ్య పోటీ తప్పేలా కనిపించడం లేదు.


హనుమాన్ తో తేజ మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. అందులోనూ మిరాయ్ సూపర్ యోధ కథ. మనోజ్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇలా ఏది చూసుకున్నా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక కిష్కింధపురి ఎప్పుడు మొదలుపెట్టారు.. ఎప్పుడు ముగించారు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఇక కాంత డబ్బింగ్ సినిమా కావడంతో కథ నచ్చితేనే అటు సైడ్ వెళ్తారు. ఇక ఈ మూడు సినిమాల్లో రిస్క్ ఎక్కువ ఉంది బెల్లకొండకు మాత్రమే. మరి బెల్లంకొండ శ్రీనివాస్.. వెనక్కి వెళ్తాడా.. రిస్క్ చేస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Bad Boy Karthik: హ‌రీష్ జ‌య‌రాజ్.. మైడియ‌ర్ జ‌న‌తా లిరిక‌ల్ వీడియో

LIK: ప్రదీప్ రంగనాథన్.. లిక్ ఫ‌స్ట్ పంచ్‌! మ‌రో హిట్ గ్యారంటీ

Updated Date - Aug 27 , 2025 | 03:43 PM