LIK: ప్రదీప్ రంగనాథన్.. లిక్ ఫస్ట్ పంచ్! మరో హిట్ గ్యారంటీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:09 PM
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటించిన చిత్రం లిక్ లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ (LIK).
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తాజాగా నటించిన చిత్రం లిక్ లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ (LIK). విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) స్వీయ దర్శకత్వంలో నిర్మించి డైరెక్షన్ చేస్తున్నాడు. కృతిశెట్టి (Krithi Shetty) కథానాయిక కాగా గౌరీ కిషన్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం పాటలు, టీజర్ సినిమాపై మంచి రెస్పాన్స్ తీసుకు వచ్చాయి.
అయితే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ బుధవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రచార కార్యకలాపాలకు తెర తేపారు. ఇందులో భాగం మొదటి పంచ్ అంటూ తమిళంలో టీజర్ విడుదల చేశారు. ఒకట్రెండు రోజుల్లో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ మధ్య వరుస బ్లాక్‌బస్టర్లతో టాప్‌లో అదరగొడుతున్న అనిరుధ్ (Anirudh) సంగీతం అందించాడు.
ఈ పస్ట్ పంచ్ టీజర్ చూస్తుంటే ప్రదీప్ మళ్లీ హిట్ గ్యారంటీ అనేలా ఉంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా ఈ సారి కొత్త ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ తరహా కాన్సెప్ట్‌తో చుట్టూ అత్యాధునిక టెక్నాలజీ, రోబోల మధ్యే సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు తీసుకు రానున్నట్లు మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు.
ఇదిలాఉంటే ప్రదీప్ రంగనాధన్ ఈ లిక్ (LIK) షూటింగ్ పూర్తయ్యాక ప్రారంభించిన మైత్రి వారి తెలుగు, తమిళ ద్విభాష చిత్రం డూడ్ (DUDE) కూడా ఇంచుమించు ఇదే డేట్‌కు థియేటర్లకు వస్తుండడం గమనార్హం.