ChiruAnil: మరీ ఇంత స్పీడా.. ముచ్చటగా మూడో షెడ్యూల్ పూర్తి

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:47 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభర సినిమాను ఫినిష్ చేస్తూనే.. ఇంకోపక్క అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాను పట్టాలెక్కించాడు.

Chiru Anil

ChiruAnil: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభర సినిమాను ఫినిష్ చేస్తూనే.. ఇంకోపక్క అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాను పట్టాలెక్కించాడు. ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి.. ఆ సినిమా తరువాత చిరుతో ఒక సినిమా మొదలుపెట్టాడు. అలా అనౌన్స్ చేశాడో లేదో వెంటనే పట్టాలెక్కించేశాడు. ఇక ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తోంది.


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మన శివశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసిన ఈ చిత్రం తాజాగా మూడో షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇటీవలే ఈ షెడ్యూల్ కోసం కేరళకు వెళ్లిన చిత్రబృందం.. కొన్ని కీలక సన్నివేశాలను, ఒక సాంగ్ ను ఫినిష్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ఇక తాజాగా కేరళ షెడ్యూల్ ముగించుకొని అనిల్ రావిపూడి, చిరంజీవి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనిల్ షేర్ చేస్తూ.. 'మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తిచేసుకుని వచ్చారు' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక నైల్- చిరు స్పీడ్ చూసి.. మరీ ఇంత ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారు ఎలా అబ్బా అని నోర్లు నొక్కుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి.. చిరుకు హిట్ ను అందిస్తాడో లేదో చూడాలి.

Pawan Kalyan: పవన్ పైనే నలుగురు భామల ఆశలు !

Suriya: తెలుగువారిని నువ్వు కూడా ఇంత మోసం చేస్తావా సూర్య

Updated Date - Jul 23 , 2025 | 05:48 PM